అందాల ముద్దుగుమ్మ  నజ్రియా గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మలయాళ మూవీ లతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ తమిళంలో తెరకెక్కిన రాజా రాణి మూవీ తో అటు తమిళ్ తో పాటు ఇటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది .

ఇది ఇలా ఉంటే రాజా రాణి సినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. రాజా రాణి మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన అంటే సుందరానికి మూవీ తో స్ట్రెయిట్ తెలుగు మూవీలో నటించింది. జూన్ 3 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయిన అంటే సుందరానికి మూవీ విడుదల అయిన మొదటి షో కే పాజిటివ్ టాక్ ను తెచ్చుకొని ప్రస్తుతం మంచి కలెక్షన్ లతో ముందుకు దూసుకుపోతోంది.  అంటే సుందరానికి మూవీ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మించారు. ఇది ఇలా ఉంటే అంటే సుందరానికి మూవీ లో నజ్రియా నటన కు ఇటు ప్రేక్షకుల నుంచి అటు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా నజ్రియా కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.  అసలు విషయం లోకి వెళితే... నజ్రియా 'అంటే సుందరానికి' మూవీ కోసం రెండు కోట్ల వరకు రెమ్యూనరేషన్ ను తీసుకున్నట్లు ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. ఇలా నజ్రియా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే అదిరిపోయే రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: