రెబల్ స్టార్ ప్రభాస్ కొన్ని రోజుల క్రితం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాధే శ్యామ్ మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను యు వి క్రియేషన్స్ బ్యానర్ వారు అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.

సినిమా కోసం ప్రభాస్ కూడా చాలా రోజుల పాటు షూటింగ్ లో పాల్గొన్నాడు. పవర్ ఫుల్ మాస్ ఇమేజ్ ఉన్న ప్రభాస్మూవీ లో మాత్రం చాలా క్లాస్ గా లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న పాత్రలో నటించాడు. ఇలా ఫుల్ మాస్ ఇమేజ్ ఉన్న ప్రభాస్ క్లాస్ ఇమేజ్ ఉన్న లవర్ బాయ్ పాత్రలో నటిస్తూ ఉండడంతో  ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలో విడుదల అయిన రాధే శ్యామ్ సినిమా ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం అందుకోలేకపోయింది. అలా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల ను కూడా పెద్దగా రాబట్టలేకపోయింది. చివరగా ఈ సినిమా చాలా వరకు నష్టాలను మిగిల్చినట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ఇది ఇలా ఉంటే థియేటర్లో ప్రేక్షకులు పెద్దగా ఆకట్టుకోలేక పోయినా రాధే శ్యామ్ సినిమా మరి కొన్ని రోజుల్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెరపై సందడి చేయబోతోంది.  

ఒకే రోజు రెండు సార్లు ఈ మూవీ టెలికాస్ట్ కాబోతుంది. రాధే శ్యామ్ మూవీ జూన్ 26 వ తేదీన జీ తెలుగు 'హెచ్ డి' లో మధ్యాహ్నం 12 గంటలకు టెలికాస్ట్ కానుంది. అదే విధంగా రాధే శ్యామ్ మూవీ జూన్ 26 వ తేదీన సాయంత్రం 6 గంటలకు  జీ తెలుగు లో ప్రసారం కానుంది. మరి థియేటర్లలో ప్రేక్షకులు పెద్దగా ఆకట్టుకోలేక పోయినా ఈ సినిమా బుల్లితెర ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: