కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన తళపతి విజయ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి తళపతి విజయ్ స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు . ఇలా కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న తళపతి విజయ్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారసుడు అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు .

సినిమా తర్వాత లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నాడు . ఇలా ప్రస్తుతం ఒక సినిమాలో నటిస్తూ మరో మూవీ ని లైన్ లో పెట్టి ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న తలపతి విజయ్ తన కుమారుడి సినిమా ఇండస్ట్రీ ఎంట్రీ కోసం కొత్త కథలను వింటున్నట్లు తెలుస్తోంది . అసలు విషయం లోకి వెళితే... తమిళ స్టార్ హీరోలలో ఒకరు ఆయన తలపతి విజయ్ తన కుమారుడు జాసన్ ను హీరోగా పరిచయం చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. కొంత కాలం క్రితం తలపతి విజయ్ తన కుమారుడు జాసన్ సినిమా ఇండస్ట్రీ ఎంట్రీ గురించి మాట్లాడుతూ... జాసన్ కి తనకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకునే స్వేచ్ఛ మరియు హక్కు ఉంది. నేనైతే నా కుమారుడిని మూవీ లే చేయాలని అనుకోను. కాకపోతే జాసన్ నటుడు అవ్వాలి అని కోరుకుంటున్నారు కాబట్టి కచ్చితంగా నేను నా కుమారుడికి సపోర్ట్ చేస్తాను అంటూ తలపతి విజయ్ చెప్పుకొచ్చాడు.

అందులో భాగంగా తలపతి విజయ్ ప్రస్తుతం తన కొడుకు సినిమా ఇండస్ట్రీ ఎంట్రీ కోసం కథలను వింటున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తలపతి విజయ్ కొన్ని రోజుల క్రితమే బీస్ట్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: