ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న తాజా చిత్రం ది వారియర్.. ఈ సినిమాను తమిళ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. సినిమా విడుదలకు రెడీ అవుతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్ పనులు కూడా చాలా జోరుగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ది వారియర్ సినిమా నుంచి ప్రమోషన్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ లభించింది. బుల్లెట్ సాంగ్ యూట్యూబ్ మరియు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. దీంతో కొన్ని మిలియన్ల వ్యూస్ ను కూడా రాబట్టింది ఈ పాట.


ఇక కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సోషల్ మీడియా వేదికగా విజిల్ అనే పాటను కూడా విడుదల చేయడం జరిగింది. విజిల్ విజిల్ విజిల్ అంటూ సాగే ఈ సాంగ్ మాస్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఇందులో హీరో రామ్ పోతినేని మాస్ లుక్స్ లో డాన్స్ తో ఆకట్టుకుంటున్నారు అని చెప్పవచ్చు. జానీ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రాఫర్ గా చేశారు పూర్తి చెట్టు కూడా రామ్ కు పోటీగా డాన్స్ చేసిందని చెప్పవచ్చు. కృతి శెట్టి తో రామ్ రామ్ వేసినా హుక్ స్టెప్ ప్రేక్షకులను బాగా అలరిస్తోంది.అటు విజువల్ గా  ఈ సాంగ్ చాలా కలర్ ఫుల్ గా ఉన్నది.. దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన మాస్ బీట్ అదిరిపోయేలా ఉంది. ఈరోజు ది వారియర్ మొత్తం టీం మరియు మీడియా సమక్షంలో జరిగిన గ్రాండ్ ఈవెంట్లో మేకర్ ఈ విజిల్ పాటను విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రాన్ని జులై 14 వ తేదీన తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో హీరో రామ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. అక్షర గౌడ కూడా ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: