రెండు భయంకరమైన ఫ్లాప్ లు ఎదురైతే ఎలాంటి టాప్ హీరోకు అయినా ఇమేజ్ తగ్గి పారితోషిక విషయంలో వెనకడుగు వేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ‘సాహో’ ‘రాథే శ్యామ్’ లాంటి భారీ ఫ్లాప్ లలో నటించినప్పటికీ ప్రభాస్ మార్కెట్ ఏమాత్రం తగ్గక పోగా అతడి పారితోషిక స్థాయి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో రికార్డులు క్రియేట్ చేసే స్థాయికి ఎదగడం ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.  


ప్రభాస్ దక్షిణాది నటుడు అలాంటి నటుడుకి బాలీవుడ్ లో క్రేజ్ ఏర్పడటమే కాదు అతడి పారితోషికం 120 కోట్ల స్థాయిని చేరుకుంది అని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తూ ఉండటం అత్యంత ఆశ్చర్యంగా మారింది. బాలీవుడ్ మీడియా వ్రాస్తున్న వార్తల ప్రకారం ‘ఆదిపురుష్’ మూవీలో నటిస్తున్నందుకు ఆమూవీ నిర్మిస్తున్న టి సిరీస్ సంస్థ ప్రభాస్ కు 120 కోట్లు ఆఫర్ చేసి అతడిని శ్రీరాముడు గా నటించడానికి ఒప్పించింది అంటూ బాలీవుడ్ మీడియా కథనాలు వ్రాస్తోంది.


ఈవార్తలే నిజం అయితే బాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకునే అక్షయ్ కుమార్ స్థానంతో సమానంగా ప్రభాస్ ఎదిగినట్లు అవుతుంది. అంతేకాదు దక్షిణ భారత దేశానికి చెందిన ఒక హీరోకు ఈ స్థాయిలో పారితోషికాన్ని ఆఫర్ చేయడం ఎవరు ఊహించని విషయం. ఇది ఇలా ఉంటే వచ్చే సంవత్సరం జనవరి 12న విడుదలకాబోతున్న ‘ఆదిపురుష్’ మూవీని ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో విడుదల చేయడమే కాకుండా ఈమూవీని ప్రపంచంలోని చాల భాషలలో డబ్ చేసి అక్కడి వారికి మన రామాయణం గొప్పతనం గురించి మరొకసారి తెలియచేసేలా ఈ మూవీ నిర్మాతలు పక్కా ప్లాన్ తో ఉన్నారని సమాచారం.


అంతేకాదు కొన్ని హిందూ మత సంస్థలు ఈమూవీని ప్రమోట్ చేసే విషయంలో సహకరించడమే కాకుండా ఈ మూవీని చూడవలసిన బాధ్యత ప్రతి హిందువుది అన్న స్థాయిలో ప్రచారం చేసే ఎత్తుగడలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలే నిజం అయితే టెక్నికల్ గా ఒక అద్భుత దృశ్య కావ్యంగా నిర్మాణం జరుపుకుంటున్న ఈ మూవీ రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అనుకోవాలి..  మరింత సమాచారం తెలుసుకోండి: