పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొంత కాలం క్రితం విడుదల అయిన రొమాంటిక్ మూవీ తో ఆకాష్ పూరి పర్వాలేదు అనే రేంజ్ విషయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఆకాష్ పూరి తాజాగా చోర్ బజార్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ లో ఆకాష్ పూరి సరసన గెహనా సిప్పీ హీరోయిన్ గా నటించగా,  ఈ మూవీ కి జార్జి రెడ్డి ఫెమ్ జీవన్ రెడ్డి దర్శకత్వం వహించాడు. సురేష్ బెబ్బులి ఈ మూవీ కి మ్యూజిక్ ని అందించగా , జగదీష్ చీకటి ఈ మూవీ కి సినిమాటోగ్రాఫర్ గా పని చేశాడు. నిన్న అనగా జూన్ 24 వ తేదీన థియేటర్ లలో  విడుదల అయిన చోర్ బజార్ సినిమా విడుదల అయిన మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అలాగే నిన్న చోర్ బజార్ మూవీ తో పాటు ఇంకో అరడజను పైగా సినిమాలు విడుదల అవడంతో ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల కూడా భారీ రేంజ్ లో రాలేదు. చోర్ బజార్ సినిమాకు మొదటి రోజు దాదాపు 40 లక్షల వరకు షేర్ కలెక్షన్ లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే చోర్ బజార్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 3.50 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

దీనితో చోర్ బజార్ సినిమా బాక్సాఫీస్ దగ్గర క్లీన్ గా నిలవాలి అంటే దాదాపుగా 4 కోట్ల వరకు కలెక్షన్ లను రాబట్ట వలసి ఉంది. ఇది ఇలా ఉంటే మొదటి రోజు మాత్రం చోర్ బజార్ సినిమాకు ఆశించిన రేంజ్  కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కలేదు. మరి రాబోయే రోజుల్లో చోర్ బజార్ సినిమా ఏ రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: