మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్ ఆర్ ఆర్' మూవీ తో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకోవడం మాత్రమే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఆర్ ఆర్ ఆర్ మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం కూడా భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. రామ్ చరణ్ ప్రస్తుతం భారతదేశం గర్వించ దగ్గ గొప్ప దర్శకులలో ఒకరు ఆయన శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. 

మూవీ లో కీయారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. ఇది వరకే వినయ విధేయ రామ సినిమాలో కలిసి నటించిన ఈ జంట ప్రస్తుతం రెండో సారి కలిసి నటిస్తోంది. ఈ సినిమా రామ్ చరణ్ కి కెరీర్ పరంగా 15 వ సినిమా కావడంతో , ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ఆర్ సి 15 పేరుతో జరుపుకుంటోంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తమన్ తాజాగా ఆర్ సి 15 మూవీ కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు.

ఆర్ సి 15 మూవీ కి సంబంధించి ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి  అని,  తనకు ఎంతో ఇష్టమైన దర్శకుడు శంకర్ కూడా తనతో సిట్టింగ్స్ లో  పాల్గొంటున్నారని, అలానే రామ్ చరణ్ గారితో కొంత గ్యాప్ తరువాత చేస్తున్న ఈ మూవీ కోసం అందరం ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నట్లు తమన్ ఈ పోస్ట్ లో చెప్పుకొచ్చాడు. అందులో భాగంగా మ్యూజిక్ సిట్టింగ్స్ సమయంలో దర్శకుడు శంకర్ తో కలిసి దిగిన ఫోటోని కూడా తమన్ సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: