సినిమా ఇండస్ట్రీలో సీక్వెల్స్ ట్రెండ్ ఎప్పటి నుండో నడుస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఏదైనా సినిమా మంచి విజయం సాధించినట్లు అయితే ఆ సినిమాకు సీక్వల్ ను తెరకెక్కించడం అనేది సినిమా ఇండస్ట్రీలో చాలా రోజులుగా జరుగుతున్న విషయమే. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈ సీక్వెల్ సినిమాల జోరు కొంచెం ఎక్కువగానే ఉంది అని చెప్పవచ్చు. ఇప్పటికే కొన్ని మంచి విజయాలు సాధించిన సినిమాలకు సీక్వెల్స్ తెరకెక్కాయి. వాటిలో కొన్ని సినిమాలు విజయాలను సాధించగా,  కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా కొన్ని మంచి విజయాలు సాధించిన  సినిమాలకు టాలీవుడ్ ఇండస్ట్రీలో సీక్వెల్స్ తెరకెక్కుతున్నాయి.  అందులో భాగంగా నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమాకు సీక్వెల్ గా అఖండ పార్ట్ 2 సినిమా తెరకెక్కబోతున్నట్లు ఒక వార్త కొన్ని రోజులుగా నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా పూర్ణ కీలకమైన పాత్రలో శ్రీకాంత్ ప్రతినాయకుడి పాత్రలో బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమా ఎ రేంజ్ విజయాన్ని సాధించిందో మన అందరికీ తెలిసిందే. అఖండ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో అలెహాండ సినిమాకు సీక్వెల్ గా అఖండ పార్ట్ 2 మూవీ ని తెరకెక్కించే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. కాకపోతే అఖండ పార్ట్ 2 సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి ఇంకా చాలా సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే అఖండ సినిమా దర్శకుడు బోయపాటి శ్రీను, రామ్ పోతినేని తో ఒక సినిమా తెరకెక్కించడానికి కమిట్ అయ్యి ఉన్నాడు. అలాగే బోయపాటి శ్రీను కూడా ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నాడు. ఇలా ప్రస్తుతం బాలకృష్ణ , బోయపాటి శ్రీను కమిట్ అయిన ప్రాజెక్ట్ లను పూర్తి చేసి, ఆ తర్వాత అఖండ  పార్ట్ 2 మూవీ ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. దానితో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి , విడుదల కావడానికి చాలా సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం అఖండ పార్ట్ 2 సినిమాను 2024 ఎలక్షన్ లకు ముందు విడుదల చేసే విధంగా చిత్ర బృందం ప్రణాళికలు వేసుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: