టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పాటు చేసుకున్నా వారిలో అల్లరి నరేష్ ఒకరు. కెరీర్ ప్రారంభంలో అల్లరి నరేష్ ఎక్కువగా కామెడీ ప్రాధాన్యత ఎక్కువ ఉన్న సినిమాల్లో నటిస్తూ కామెడీ హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. కానీ ఆ తర్వాత గమ్యం మూవీ లో సీరియస్ పాత్రలో నటించి అల్లరి నరేష్ ఇటు ప్రేక్షకుల నుండి, అటు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. 

ఇది ఇలా ఉంటే సుడిగాడు మూవీ తో మంచి విజయాన్ని అందుకున్న అల్లరి నరేష్ , ఆ తర్వాత ఒక మంచి విజయం కోసం చాలా సంవత్సరాల పాటు ఎదురు చూశాడు. అలాంటి సమయం లోనే విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన నాంది మూవీ తో అల్లరి నరేష్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకోవడమే మాత్రమే కాకుండా ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలను కూడా అందుకున్నాడు.  ఈ సినిమాలో అల్లరి నరేష్ దాదాపు సినిమా మొత్తం సీరియస్ నోట్ లో ఉండే పాత్రలో నటించాడు. ఇలా అల్లరి నరేష్ కు చాలా రోజుల తర్వాత మంచి విజయాన్ని అందించిన విజయ కనకమేడల దర్శకత్వంలో అల్లరి నరేష్ మరో సారి నటించబోతున్నాడు. తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ ను కూడా చిత్ర బృందం విడుదల చేసింది.

పోస్టర్ లో సంకెళ్లు ఉన్న రెండు చేతులు.. గోడపై పక్షి నీడలా కనిపించేలా డిజైన్ చేశారు. ఈ పోస్టర్ ను అల్లరి నరేష్ సోషల్ మీడియాలో  షేర్ చేసాడు.  ‘షాడో ఆఫ్ హోప్ (ఆశ యొక్క నీడ)’ అని ఈ పోస్టర్ కి హ్యాష్ ట్యాగ్ చేశాడు. ఈ మూవీ ని షైన్ స్క్రీన్స్‌ సంస్థ నిర్మించబోతోంది. నరేష్ , విజయ్ కనకమేడల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా అల్లరి నరేష్ కు 60 వ మూవీ కాగా, దర్శకుడు విజయ్ కనకమెడలకు రెండవావ్సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి: