ప్రేమ ఆ తర్వాత రిలేషన్ షిప్ మెయింటెయిన్ చేయడం.. అప్పటికి అంతా బాగుంది అనుకుంటే ఏవో కొన్ని జంటలు పెళ్లి పీటలు ఎక్కుతాయి. ఆ తరవాత భాగస్వాములు అయ్యాక మనస్పర్ధలు వచ్చి విడిపోయిన సెలబ్రిటీ జంటలు చాలానే ఉన్నాయి. అయితే ఇంత దూరం ఎందుకు పెళ్లి చేసుకుని విడిపోవడం కన్నా.. కుదరదు అనుకుంటే ముందుగానే ఎవరి దారి వారు చూసుకోవడం మంచిది అని బ్రేకప్ చెప్పుకున్న సెలబ్రిటీ జంటలు కోకొల్లలు. ఇదే తరహాలో యంగేజ్మెంట్ చేసుకుని విడిపోయిన సెలబ్రిటీలు కూడా చాలామంది ఉన్నారు. ఈ మధ్య అక్కినేని హీరో అఖిల్ కూడా అంగరంగ వైభవంగా నిశ్చితార్దం చేసుకుని ఆ తరవాత మనస్పర్ధలు రావడం తో రద్దు చేసుకున్నారు.

ఇదే తరహాలో కొందరు హీరోయిన్లు సైతం నిశ్చితార్థం తర్వాత కొన్ని కారణాల వలన రద్దు చేసుకున్నారు. వారెవరూ ఎందుకు వారి నిశ్చితార్థం క్యాన్సిల్ అయింది అన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం పదండి. త్రిష , రష్మిక  మందన్నా, మెహ్రిన్ లు తమకు నచ్చిన వారితో నిశ్చితార్దం చేసుకుని ఆ తరవాత  వాటిని రద్దు చేసుకున్నారు.

మెహ్రిన్ : పంజాబీ అమ్మాయి అయిన  మెహ్రీన్ టాలీవుడ్‌లో ప్రస్తుతం బిజీ హీరోయిన్ గా రాణిస్తుంది.  ఎఫ్ 2, ఎఫ్ 3 చిత్రాలతో ఈ అమ్మడు కి బాగా క్రేజ్ ను పెంచుకుంది. హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనవడు, యువ రాజకీయ వేత్త అయిన భవ్య బిష్ణోయ్‌తో యంగేజ్మెంట్ చేసుకున్న ఈ చిన్నది ఆ తర్వాత రద్దు చేసుకుని మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోయింది. అయితే తన ఎంగేజ్మెంట్ రద్దు చేసుకోవడానికి కారణం మెహ్రిన్ పెళ్లయ్యాక సినిమాల్లో నటించకూడదు అని అత్తింటి వాళ్ళు కండిషన్ పెట్టడంతో మెహ్రిన్ అది నచ్ఛక  పెళ్లి రద్దు చేసుకున్నాడట.

త్రిష: టాలీవుడ్ , కోలీవుడ్ చిత్రాల్లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన త్రిష ఇప్పటికీ అవకాశాలు అందుకుంటూ చిత్రాలు చేస్తున్నారు. ప్రముఖ బిజినెస్ మ్యాన్ అయిన వరుణ్ మణియన్‌తో ఎంగేజ్మెంట్ చేసుకుంది. అయితే పెళ్లి వరకు వారి ప్రయాణం సాగలేదు. వరుణ్ పెళ్లయ్యాక నటించకూడదన్న కండీషన్ పెట్టడం తోనే ఆమె పెళ్లి క్యాన్సిల్ చేసుకుని మళ్లీ సినిమాలు చేస్తున్నారు. మూడు పదుల వయసు దాటినా ఇప్పటికీ సింగిల్ గానే లైఫ్ లీడ్ చేస్తోంది త్రిష. గతంలో దగ్గుబాటి రానాతో ఈమె చెట్టాపట్టాలు వేసుకుని తిరిగింది అని, మరో నటుడు సిద్ధార్ద్ తో కూడా పీకల్లోతు ప్రేమాయణం నడిపింది అని చాలా వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

రష్మిక మందన్నా: కన్నడం నుండి తెలుగు లోకి రంగ ప్రవేశం చేసి ఇపుడు స్టార్ హీరోయిన్ గా ఇక్కడ రాణిస్తున్న రష్మిక మందన్న  కూడా ఇలాగే ఎంగేజ్మెంట్ చేసుకొని ఆ తర్వాత రద్దు చేసుకున్నారు. హీరో రక్షిత్ శెట్టితో ప్రేమలో మునిగి తేలిన ఈమె అతడితో నిశ్చితార్దం చేసుకున్న  తరవాత ఈమెకు అవకాశాలు బాగా పెరగడం, స్టార్ హీరోలతో   కెరియర్ పీక్స్ కి వెళ్ళడంతో ఆ టైం లో పెళ్లి అంటే కెరియర్ ఘాడి తప్పుతుంది అని నిశ్చితార్దం రదు చేసుకున్నారు రష్మిక. ప్రస్తుతం ఓ టాలీవుడ్ స్టార్ హీరోతో ఈమె రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వినపడుతున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: