కన్నడ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న కిచ్చ సుదీప్ తాజాగా విక్రాంత్ రోనా అనే పాన్ ఇండియా సినిమాలో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను కూడా చిత్ర బృందం విడుదల చేయగా, ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది.

ఈ సినిమాను 28 జూలై 2022 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఒక లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే... పాన్ ఇండియా మూవీ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన విక్రాంత్ రోనా మూవీ తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్‌ ని వరంగల్ శ్రీను కైవసం కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది. వరంగల్ శ్రీను తన కార్తికేయ గ్రూప్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విక్రాంత్ రోనా మూవీ ని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.  ఇప్పటికే వరంగల్ శ్రీను నైజాం ఏరియాలో క్రాక్ , ఈస్మార్ట్ శంకర్, సిటి మార్ , ఆచార్య వంటి పలు సినిమాలను విడుదల చేశాడు. ఇందులో భాగంగా ఈ మధ్య ఆచార్య సినిమాతో ఈ డిస్ట్రిబ్యూటర్ చాలా వరకు నష్టాలను అందుకున్నట్లు అనేక వార్తలు బయటకు వచ్చాయి.

ఇలా నైజాం ఏరియాలో బలమైన ప్రొడ్యూసర్ గా మారిన వరంగల్ శ్రీను పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ఉన్న విక్రాంత్ రోనా సినిమా రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం కిచ్చ సుదీప్ 'పైల్వాన్' అనే పాన్ ఇండియా సినిమాలో నటించాడు. కాకపోతే ఈ సినిమా పెద్ద విజయాన్ని అందుకోలేకపోయింది. మరి విక్రాంత్ రోనా మూవీ తో కిచ్చ సుదీప్ ఎలాంటి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: