మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి 'ఆర్ ఆర్ ఆర్' మూవీ ని తెరకెక్కించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ఆలియా భట్ హీరోయిన్ గా నటించగా , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ హీరోయిన్ గా నటించింది. 

మూవీ లో అజయ్ దేవగన్ , శ్రేయ , సముద్ర కని ఇతర ప్రధాన పాత్రలలో నటించగా,  ఎం ఎం కీరవాణిమూవీ కి సంగీతాన్ని అందించాడు. ప్రముఖ నిర్మాతలలో ఒకరైన డివివి దానయ్య భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించాడు. అనేక సార్లు విడుదల వాయిదా పడిన 'ఆర్ ఆర్ ఆర్' సినిమా ఎట్టకేలకు మార్చి 25 వ తేదీన భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా తెలుగు , తమిళ ,  మలయాళ , కన్నడ , హిందీ భాషలలో ఒకే రోజు గ్రాండ్ గా విడుదలైంది. దర్శకధీరుడు రాజమౌళి 'బాహుబలి' లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత దర్శకత్వం వహించిన సినిమా కావడం, టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో హీరోలుగా నటించడంతో ఈ సినిమాపై ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

అలా భారీ అంచనాల నడుమ మార్చ్ 25 వ తేదీన విడుదలైన 'ఆర్ ఆర్ ఆర్'  సినిమా ఆ అంచనాలకు తగినట్లు గానే అదిరిపోయే బ్లాక్ బస్టర్ టాక్ ని తెచ్చుకొని దాదాపు 1100 వందల కోట్లకు పైగా కలెక్షన్ లను ప్రపంచవ్యాప్తంగా సాధించి అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ఈ రోజుతో 'ఆర్ ఆర్ ఆర్' సినిమా 100 రోజులు పూర్తి చేసుకోబోతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం తాజాగా ఒక పోస్టర్ ను విడుదల చేసింది. తాజాగా 'ఆర్ ఆర్ ఆర్' చిత్ర బృందం 100 రోజుల సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

rrr