150 సినిమాలకు పైగా నటించిన చిరంజీవి కూడ ఒకేఒక్క ఫ్లాప్ ఎలా భయపెడుతుందో లేటెస్ట్ గా విడుదలైన ‘ఆచార్య’ మూవీ ఫలితం అందరికీ అర్థం అయ్యేలా చేసింది. మెగా స్టార్ గా కోట్లాదిమంది అభిమానులు కలిగిన చిరంజీవి నటించిన ‘ఆచార్య’ మూవీకి ఫెయిల్యూర్ టాక్ రావడంతో ఆసినిమా మొదటిరోజు నుండే చాలచోట్ల ధియేటర్లు ఖాళీగా కనిపించడం సంచలనంగా మారినవిషయం తెలిసిందే.


ఈషాక్ నుండి తేరుకోవడానికి చిరంజీవి ఒక నెలరోజుల పాటు అమెరికాకు వెళ్ళి అక్కడ తమ సన్నిహితులతో కొంతకాలం గడిపిన తరువాత కానీ చిరంజీవికి ‘ఆచార్య’ ఇచ్చిన షాక్ పోలేదు అని అంటారు. అమెరికా నుండి తిరిగి వచ్చిన తరువాత చిరంజీవి తాను ప్రస్తుతం నటిస్తున్న సినిమాల లైనప్ పై ప్రత్యేకమైన శ్రద్ధను తీసుకోవడమే కాకుండా రాబోతున్న దసరా కు ‘గాడ్ ఫాదర్’ అదేవిధంగా వచ్చే సంవత్సరం సంక్రాంతికి ‘వాల్టేర్ వీరయ్యా’ సినిమాలను విడుదల అయ్యేలా పక్కా ప్లాన్ వేసుకుని ప్రతి మూడు నెలలకు తన వైపు నుండి ఒక సినిమా ఉండేలా చిరంజీవి ప్లాన్ చేసుకుంటున్నాడు.


అయితే మనం ఎంత కష్టపడి పనిచేసినా కనిపించని విధి ఎంతోకొంత ప్రభావితం ఉంటుంది కాబట్టి చిరంజీవి తన పేరు విషయంలో చిన్న మార్పులు చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు చిరంజీవి సినిమాలకు సంబంధించిన టీజర్లలో ‘MEGA STAR CHIRANJEEVI’ అంటూ టైటిల్ కార్డ్ వేసేవారు. అయితే దసరా కు రాబోతున్న ‘గాడ్ ఫాదర్’ మూవీకి సంబంధించిన టీజర్ లో ‘MEGA STAR CHIRANJEEEVI’ అంటూ స్పెల్లింగ్ లో అదనంగా మరొక ‘E’ అక్షరం చేర్చడం ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.


కొత్త హీరోలు అదేవిధంగా చిన్న హీరోలు ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తమ సినిమాలు వరసగా ఫ్లాప్ అవుతున్నప్పుడు ఆఫ్లాప్ ల నుండి తప్పించుకోవడానికి న్యూమరాలజీ సెంటిమెంట్ ను అనుసరిస్తూ ఇలా తమ పేర్లలో ఒక కొత్త అక్షరాన్ని చేర్చుకుంటూ ఉంటారు. అయితే తెలుగు సినిమా పరిశ్రమ గర్వించే స్థాయికి ఎదిగిన చిరంజీవి కూడ ఒక్క ‘ఆచార్య’ ఫ్లాప్ కు హడిలిపోయి ఇలా తన పేరులో కొత్త అక్షరాలు కలుపుకునే స్థితికి వచ్చాడా అంటూ కొందరు తమ ఆశ్చర్యాన్ని వ్యక్త పరుస్తున్నారు..
మరింత సమాచారం తెలుసుకోండి: