కొంతకాలం క్రితంవరకు తెలుగు సినిమాలు అంటే హిందీ ప్రేక్షకులలో చాల చిన్నచూపు ఉండేది. అయితే ‘బాహుబలి’ విడుదల తరువాత బాలీవుడ్ ప్రేక్షకులకు తెలుగు సినిమా ఆరాధ్యంగా మారి అంత గొప్ప సినిమాలు బాలీవుడ్ లో ఎందుకు రావడంలేదు అంటూ బాలీవుడ్ మీడియా బాలీవుడ్ ప్రముఖ దర్శకులకు ప్రశ్నలు వేయడం మొదలుపెట్టింది.


‘బాహుబలి’ ని అనుకరిస్తూ కొన్ని భారీ సినిమాలు హిందీలో వచ్చినప్పటికీ అవన్నీ ఘోరంగా ఫెయిల్ కావడంతో దక్షణాది సినిమా మ్యాజిక్ పై అంతర్మధనం మొదలైంది. దీనికి కొనసాగింపుగా కరోనా పరిస్థితులు తరువాత గత సంవత్సరం విడుదలైన ‘పుష్ప’ ఈసంవత్సరం విడుదలైన ‘ఆర్ ఆర్ ఆర్’ ‘కేజీ ఎఫ్ 2’ లతో పూర్తిగా బాలీవుడ్ ప్రేక్షకులు దక్షిణాది సినిమాలకు అలవాటు పడిపోయారు.


దీనితో భారీ పెట్టుబడితో తీసే భారీ సినిమా అంటే చాలు ఆసినిమాలు అన్నీ పాన్ ఇండియా సినిమాలుగా మారిపోవడమే కాకుండా టాప్ బాలీవుడ్ నిర్మాణ సంస్థలు అత్యంత భారీ పారితోషికాలు ఇచ్చి మన దక్షిణాది హీరోలతో భారీ సినిమాలు చేయడానికి క్యూ కడుతున్నాయి. ఈపరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్న బాలీవుడ్ టాప్ హీరోలు సల్మాన్ ఖాన్ షారూఖ్ ఖాన్ అమీర్ ఖాన్ లాంటి లెజండరీ సెలెబ్రెటీలు దక్షిణాది హీరోలతో సినిమాలు చేయడానికి ఆశక్తి కనపరుస్తూ దక్షిణాది దర్శకులను కూడ లైన్ లో పెట్టుకుంటున్నారు.


అంతేకాదు బాలీవుడ్ టాప్ హీరోల సినిమాల షూటింగ్ ముంబాయ్ లో కాకుండా హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో కొనసాగిస్తూ ఉండటం చూస్తూ ఉంటే ఉత్తరాది టాప్ హీరోలకు దక్షిణాది సినిమా రంగం పై పెరిగిన ప్రేమ అర్థం అవుతుంది. ఈపరిస్థితి గమనించిన బాలీవుడ్ మీడియా కూడ ఇప్పుడు దక్షిణాది సినిమారంగ ప్రముఖులను హైలెట్ చేస్తూ బాలీవుడ్ పత్రికలలో కవర్ స్టోరీస్ ప్రచురిస్తున్నాయి. లేటెస్ట్ గా ఇండియా టుడే అదేవిధంగా బిజినెస్ ఇండియా లాంటి ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రికలు అల్లు అర్జున్ రామ్ చరణ్ ప్రభాస్ యష్ రాజమౌళి ఫోటోలను ప్రముఖంగా కవర్ పేజీ లపై ప్రచురిస్తూ చేస్తున్న హడావిడి చూస్తుంటే బాలీవుడ్ మీడియా దక్షిణాది సునామీని అంగీకరించిందా అన్నసందేహాలు వస్తున్నాయి..  




మరింత సమాచారం తెలుసుకోండి: