యంగ్ హీరో నిఖిల్ ఇండస్ట్రీలోకి వచ్చి పుష్కర కాలం దాటిపోయినప్పటికీ ఇప్పటికీ అతడు పూర్తిగా ఇండస్ట్రీలో పూర్తిగా నిలబడలేక పోతున్నాడు. మధ్యమధ్యలో ఇతడి సినిమాలు హిట్ అయినప్పటికీ ఆతరువాత మళ్ళీ వరస ఫ్లాప్ లు రావడంతో అతడి మార్కెట్ ఇంకా పెరగడం లేదు.


ఇలాంటి పరిస్థితులలో గతంలో తనకు హిట్ ఇచ్చిన ‘కార్తికేయ’ మూవీకి ఇప్పుడు సీక్వెల్ తీస్తున్నాడు. ‘కార్తికేయ 2’ పేరుతో రాబోతున్న ఈమూవీ కృష్ణుడు చుట్టూ తిరుగుతుంది. అందుకే ఇస్కాన్ టెంపుల్ వారు కూడ ఈమూవీని పరోక్షంగా ప్రమోట్ చేస్తూ ఈసినిమా ఫంక్షన్ ను కృష్ణుడి ఆలయంలో నిర్వహించుకోవడానికి అనుమతులు ఇచ్చారు.


వాస్తవానికి ఈమూవీ సమ్మర్ రేస్ కు రావాలి అయితే ఎక్కడా ధియేటర్లు దొరకక పోవడంతో క్రితం నెల మూడవ వారంలో రావడానికి ప్రయత్నించాడు. అయితే అక్కడ దిల్ రాజ్ నిర్మించిన ‘థాంక్యూ’ మూవీ అడ్డు తగలడంతో దిల్ రాజ్ కు ఆగ్రహం తెప్పించే పని చేయలేక చివరకు ఆగష్టు నెల రెండవ వారంలో నితిన్ ‘మాచర్ల నియోజక వర్గంతో పోటీ పడుతున్నాడు. ఈమూవీని ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండస్ట్రీ రాజకీయాల పై స్పందించాడు. ప్రస్తుతం టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో కొందరు నిర్మాతలు చేస్తున్న పవర్ పోలిటిక్స్ వల్ల చిన్నా మీడియం రేంజ్ సినిమాలు నష్టపోతున్నాయని అయితే ఆసినిమాల నిర్మాతలు జరుగుతున్న విషయాలను ధైర్యంగా బయటకు చెప్పలేకపోతున్నారని కామెంట్ చేసాడు.


దీనితో నిఖిల్ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీని శాసిస్తున్న ఆ నలుగురుని దృష్టిలో పెట్టుకుని చేసాడా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ‘కార్తికేయా 2’ లో కలర్స్ స్వాతి ఒక అతిధి పాత్రలో కనిపిస్తుంది అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈవిషయమై నిఖిల్ ఇప్పటివరకు ఏవిషయం బయటకు చెప్పకపోవడంతో నిఖిల్ ఈవిషయాన్ని కావాలనే రహస్యంగా ఉంచుతున్నాడా లేదంటే ఇదంతా సోషల్ మీడియాలో జరుగుతున్న గాసిప్పుల వ్యవహారమా అంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు..
మరింత సమాచారం తెలుసుకోండి: