దర్శకుడు హను రాఘవపూడి తన కెరీర్ లో ఇప్పటి వరకు చాలా మూవీ లకు దర్శకత్వం వహించాడు. అందులో 'లై' మూవీ ని మినహాయిస్తే మిగతావి అవి అన్నీ కూడా ప్రేమ కథా చిత్రాలే. ఇందులో కొన్ని సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర పెద్ద విజయాలను అందుకోక పోయినప్పటికీ, విమర్శకుల నుండి మాత్రం మంచి ప్రశంసలు అందుకున్నాయి.

అలాగే హను రాఘవపూడి వెండి తెరపై ప్రేమకథలను అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు అనే గుర్తింపు ను కూడా సంపాదించుకున్నాడు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న హను రాఘవపూడి తాజాగా సీతా రామం అనే మరో ప్రేమ కథా చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించగా , మృణాళిని ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. రష్మిక మందన ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో నటించగా , సుమంత్ , తరుణ్  భాస్కర్ , భూమిక చావ్లా , గౌతమ్ వాసుదేవ్ మీనన్మూవీ లో ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. మంచి అంచనాల నడుమ ఈ సినిమా ఆగస్ట్ 5 వ తేదీన విడుదల అయ్యింది. ఈ మూవీ కి మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ టాక్ దక్కింది.

ఇలా మొదటి రోజు ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో అద్భుతమైన ఓపెనింగ్స్ కూడా ఈ మూవీ కి దక్కాయి. అలాగే మొదటి రోజు తో పోలిస్తే రెండవ రోజు ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ కలెక్షన్ లు లభించాయి. అలాగే రెండవ రోజు తో పోలిస్తే మూడవ రోజుకు ఈ మూవీ కి బుకింగ్ లు మెరుగ్గా ఉన్నాయి. దానితో ఈ మూవీ యూనిట్ ఈ మూవీ కి అదనపు థియేటర్ లను మరియు అదనపు షో లను జోడించడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: