ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. ఒక బ్యాట్స్ మెన్ కొన్ని సార్లు ఫీల్డర్లకు క్యాచ్ లను ఇస్తుంటారు. కానీ వాటిని ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు నేలపాలు చేస్తుంటారు. ఫలితం ఆ బ్యాట్స్ మెన్ సెంచరీ చేశో.. లేక బాగా ఆడి తన టీమ్ ని విజయ తీరాలకు చేరుస్తాడు. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో కూడా అదే జరుగుతుంది. ప్రధాని మోదీ తన పదేళ్ల కాలంలో ప్రతిపక్షాలకు అనేక అవకాశాలు ఇచ్చినా వాటిని సద్వినియోగ పరచుకోవడంలో అవి విఫలం అయ్యారు.


ఫలితం ప్రధాని మోదీ అజేయ శక్తిగా మారారు.  ఇప్పుడు మూడో సారి కూడా అధికారాన్ని తిరిగి నిలబెట్టుకునేందుకు పావులు కదుపుతున్నారు.  ఈ పదేళ్ల కాలంలో మోదీ ప్రతిపక్షాలకు మూడు సార్లు అవకాశం ఇచ్చారు.  మోదీ 2014లో అధికారం చేపట్టిన తర్వాత 2014 నుంచి 16 వరకు ఆ పార్టీకి విజయాలు లేవు.  దిల్లీ, బిహార్ వంటి రాష్ట్రాల్లో ఓటమి పాలయ్యారు.  ఆ సమయంలో ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ లాంటి సీనియర్ నేతలు పార్టీ అధిష్ఠానానికి లేఖలు రాశారు. మోదీ, షా నాయకత్వంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు.


2019 సార్వత్రికానికి ముందు కూడా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే నాలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీకి అధికారం దక్కలేదు. మూడు చోట్ల కాంగ్రెస్ అద్భుత విజయం సాధించింది. కానీ ఆ వేవ్ ని నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలం అయింది. మళ్లీ కరోనా సమయంలో కూడా చాలా చోట్ల అనేక మంది పాదయాత్ర లు చేసుకుంటూ సొంత గ్రామాల బాట పట్టారు. హృదయ విధాకర ఘటనలతో.. కరోనా రెండో వేవ్ లో మోదీపై వ్యతిరేకత వ్యక్తం అయింది.  


కానీ ప్రతిపక్షాలు సరైన విధంగా ప్రచారం చేయలేకపోవడంతో కొవిడ్ ను జయించిన వీరుడిగా మోదీని బీజేపీ ప్రొజెక్ట్ చేసింది. ఇదే సమయంలో నోట్ల రద్దు వంటి అంశాలు కూడా ప్రధాని పై సామాన్య మానవుల్లో వ్యతిరేకత వ్యక్తం అయింది. కానీ మోదీ తెలివిగా ఈ చర్యలను తనకు అనుకూలంగా మార్చుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: