ఇక ఇప్పుడు ఇండస్ట్రీ లో ఎక్కడ చూసినా కూడా బింబిసార, సీతారామం సినిమాల సక్సెస్ గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు. జనం అసలు థియేటర్స్ రావటం లేదు...ఇంకా అసలు ఓఫినింగ్స్ లేవు, కలెక్షన్స్ లేవు అనుకున్న టైమ్ లో బింబిసార చిత్రానికి అయితే హౌస్ ఫుల్ బోర్డ్ లు పడుతున్నాయి.ఇక సీతారామం చిత్రం అయితే మల్టిప్లెక్స్ లలో అదరకొడుతుంది. ఈ నేపధ్యంలో నిర్మాతల అందరి టార్గెట్ ఇప్పుడు దిల్ రాజు అయ్యారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.దానికి కారణం ...దిల్ రాజు ఇండైరక్ట్ గా తన మాటలతో తెలుగు పరిశ్రమ షూటింగ్ ల బంద్ నిర్ణయం తీసుకునేలా చేయటం అని అంటున్నారు.ఇక తన థాంక్యూ చిత్రం థియేటర్స్ లో డిజాస్టర్ అవటం, ఎఫ్ 3 చిత్రం ప్లాప్ అవ్వడం  కారణం ...ఓటిటిలని ఇంకా బడ్జెట్ లు ఎక్కువ అవటం అని , హీరోలు ఇంకా డైరక్టర్స్ తమ రెమ్యునేషన్స్ తగ్గించుకోవాలని అంటూ వస్తున్నారు. గతంలో లాగ జనం థియేటర్ కు వచ్చి సినిమాలు చూడటం లేదని ఆయన మాట్లాడారు. అయితే ఇప్పుడీ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ తో కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా జనం థియేటర్ కు వస్తారని అది ప్రూవ్ అయ్యిందని అంటున్నారు.


థియేటర్స్ లో సాలిడ్ అక్యుపెన్సీ ఉండటం అందరినీ కూడా చాలా ఆనందపరుస్తోంది.ఇంకా చాలా మంది నిర్మాతలు కూడా ఇప్పుడు కళ్యాణ్ రామ్, దుల్కర్ వంటి హీరోలతోనే జనం థియేటర్స్ వస్తున్నప్పుడు మిగతా హీరోల సినిమాలను ఖచ్చితంగా ఆదరిస్తారనే ధైర్యం కూడా వచ్చిందని అంటున్నారు. అయితే మంచి కంటెంట్ ఉండాలని ఈ షూటింగ్ లు ఆపి ఆలోచించాల్సిన పనిలేదని చెప్తున్నారు. చాలా మంది నిర్మాతలు కూడా షూటింగ్ లు ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు. డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఉత్సాహంగా ఉన్నారని సమాచారం తెలుస్తోంది. విక్రాంత్ రోణ లాంటి డబ్బింగ్ సినిమా కూడా హిట్ అవటం ఇండస్ట్రీకి మంచి ఊపు ఇచ్చిందనే చెప్పాలి.అలాగే దానికి తోడు దిల్ రాజు తను తమిళ స్టార్ విజయ్ తో చేస్తున్న వారసుడు చిత్రం షూటింగ్ ఆపకపోవటం కూడా వారికి కోపం తెప్పిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: