టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అగ్ర హీరో గా ఉన్న విజయ్ దేవరకొండ ఇప్పుడు తన లేటెస్ట్ సినిమా లైగర్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టాడు దేవరకొండ. దేశంలోని పలు ప్రాంతాలలో ప్రమోషన్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ హీరో 25 వ తేదీన భారీ విజయం అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమా కి పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే విజయ్ దేవరకొండసినిమా ను విడుదల చేయడనికి సిద్ధమవుతూనే మరోసమయంలో తమ్ముడు ఆనంద్ దేవరకొండ సినిమా పనులను చేయడానికి సిద్ధమవుతున్నాడు.

దొరసాని సినిమా తో ఆనంద్ దేవరకొండ సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చాడు. ఆ సినిమా పర్వాలేదనిపించుకోగా నటుడిగా ప్రేక్షకులలో మంచి మార్కులు కొట్టేశాడు. ఆ తర్వాత అయన చేసిన నెక్స్ట్ సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్ మంచి విజయాన్ని అందుకుంది. కరోనా కారణంగా ధియేటర్ లో విడుదల చేయకపోవడం తో ఓటీటీ లో ఈ సినిమా ను విడుదల చేయగా దీనికి మంచి స్పందన వచ్చింది. అలా ఈ సినిమా కు ప్రేక్షకులు భారీగా ఓట్లు వేశారు. ఆ తరువాత అయన చేసిన చిత్రం పుష్పక విమానం సినిమా థియేటర్ లలో విడుదల కాగా అది కొంత నిరాశపరిచింది అని చెప్పొచ్చు.

ఇకపోతే ఇప్పుడు అయన హైవే సినిమా తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ప్రముఖ సినిమాటోగ్రఫర్ కెవి గుహన్ ఈ సినిమా కి దర్శకత్వం వహించాడు. చాలారోజుల తరువాత రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇకపోతే ఈ విధంగా ఈ ఇద్దరు అన్నదమ్ములు తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆహా లో ఈ సినిమా ను ఈనెల 19 న విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు. మరి ఈ నెల వీరికి కలిసి వస్తుందా అనేది చూడాలి. ఆనంద్ దేవరకొండసినిమా పట్ల మంచి నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: