సినిమా ఇండస్ట్రీలో ఒ కేరోజు అనేక సినిమాలు విడుదల అవుతూ ఉండడం మనం చాలా సార్లు గమనిస్తూ ఉంటాం. అలా ఒకే రోజు అనేక సినిమాలు విడుదల అయిన సందర్భంలో అన్ని చిన్న స్థాయి సినిమాలు కనుక విడుదల అయినట్లయితే ఆ మూవీలలో ఏ  మూవీ కి హిట్ టాక్ వస్తే ఆ మూవీకి మంచి కలెక్షన్లు దక్కుతాయి. అలాగే భారీ క్రేజ్ ఉన్న హీరోల సినిమాలు కూడా ఒకే రోజు విడుదల అయినట్లయితే అందులో ఏ మూవీ కి మంచి టాక్ లభిస్తుందో ఆ మూవీ కే డీసెంట్ కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర లభిస్తుంటాయి.

ఒక వేళ ఇద్దరు స్టార్ హీరోలు ఒకే రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర తమ సినిమాలను విడుదల చేసినట్లు అయితే రెండు సినిమాలకు మంచి టాక్ వచ్చినా కూడా మూవీ కలెక్షన్ లపై కాస్త ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అందువల్లనే స్టార్ హీరోల సినిమాలు దాదాపుగా ఒక రోజు విడుదల కాకుండా మూవీ యూనిట్ ప్లాన్ చేసుకుంటూ ఉంటాయి. కాకపోతే వచ్చే సంవత్సరం ఇద్దరు  ఇండియా వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ఉన్న హీరోల సినిమాలు ఒకే రోజు విడుదల కాబోతున్నాయి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి పాన్ ఇండియా రేంజ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ప్రభాస్ తాజాగా నటిస్తున్న సలార్ సినిమాను 28 సెప్టెంబర్ 2023 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఇదే తేదీన హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కుతున్న ఫైటర్ మూవీ ను కూడా విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ చాలా రోజుల క్రితమే ప్రకటించింది. ఈ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజు విడుదల కాబోతున్నాయి. మరి ఇందులో ఏ మూవీ ఏ రేంజ్ లో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: