నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ 2 సినిమా తో చాలా రోజుల తర్వాత భారీ విజయాన్ని అందుకున్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన కార్తికేయ 2 సినిమా ద్వారా ఆయన కూడా భారీ విజయాన్ని నమోదు చేసుకోగా ఈ చిత్రం కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషలలో సైతం మంచి విజయాన్ని అందుకుంది. గత కొన్ని రోజులుగా నార్త్ సినిమా పరిశ్రమలలో సౌత్ సినిమాలు చూపిస్తున్న ప్రభంజనం అంతా ఇంత కాదు. అక్కడి సినిమాల కంటే ఎక్కువగా మన సినిమాలనే ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు.
అలా అక్కడ వచ్చిన సినిమాలు వచ్చినట్లుగా ఫ్లాప్ అవుతూ ఉంటే మన తెలుగు సినిమాలు మాత్రం అక్కడ భారీ స్థాయిలో విజయాలను అందుకుంటూ ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో హిందీలో నిఖిల్ సినిమాకు మంచి పేరు రావడం నిజంగా హిందీ వారిని ఎంతగానో బాధపెట్టే విషయం అని చెప్పాలి. కంటెంట్ బాగా ఉండటం సినిమా టేకింగ్ విషయంలో మంచి జాగ్రత్తలు తీసుకోవడం వంటివి జరగడంతో ఈ సినిమాకు ఇప్పుడు అక్కడ మంచి ఆదరణ దక్కుతుంది. దానికి తోడు కొంతమంది బాలీవుడ్ నటులు కూడా ఈ సినిమాలో నటించడం ఈ సినిమాను అక్కడ చూడడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన నార్త్ కలెక్షన్స్ అక్కడి పెద్ద సినిమాలకు సమానంగా ఉండడం నిఖిల్ కు మంచి క్రేజీ వచ్చింది అని చెప్పడానికి నిదర్శనం అని చెప్పాలి. మరి భవిష్యత్తులో ఈ సినిమా అక్కడ ఎన్ని కలెక్షన్లతో క్లోజ్ చేస్తుందో చూడాలి. అక్కడ భారీ స్థాయిలో నిఖిల్ తన తదుపరి సినిమా స్పై ను విడుదల చేయబోతున్నాడు. తప్పకుండా పాన్ ఇండియా హీరోగా నిఖిల్ మారాడనే చెప్పాలి. తొలి సినిమా నుంచి ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చిన ఈ హీరో ఇప్పుడు మంచి విజయంతో పాటు ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ కూడా సంపాదించుకోవడం విశేషం. మరి ఈ స్టార్ డం ను ఆయన ఏ విధంగా నిలబెట్టుకుంటాడో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి