ప్రస్తుతం బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బాయ్‌కాట్‌ ట్రెండ్ నడుస్తోంది అన్న సంగతి అందరికీ తెలిసిందే. అంతేకాదు ప్రస్తుతం నెటిజన్స్ బాలీవుడ్ సినిమాలను, అలాగే బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలను బాయ్‌కాట్‌ చేస్తున్నారు.ఇటీవల ఆమిర్‌ ఖాన్‌,తాప్సీ,అక్షయ్ కుమార్ సినిమాల విషయంలో బాయ్‌కాట్‌ సెగ తగిలిన విషయం తెలిసిందే. అయితే కేవలం బాలీవుడ్ లో మాత్రమే కాకుండా టాలీవుడ్ లో కూడా ఈ బాయ్‌కాట్‌ అన్న పేరు ఎక్కువగా వినిపిస్తోంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా విడుదల అయిన తర్వాత లైగర్ సినిమాని బహిష్కరించాలి అంటూ ట్విట్టర్ లో #BoycottLiger అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేశారు.

అయితే  ఇక ఈ సినిమాలకు మాత్రమే కాకుండా ఈ మధ్యకాలంలో విడుదలైన పెద్ద సినిమాలన్నింటికీ ఏదో రకంగా బాయ్‌కాట్‌ సెగ తగిలింది. అయితే ఇప్పటికే ఈ బాయికాట్ విషయంలో పలువురు స్టార్ హీరోలు హీరోయిన్ లు సైతం స్పందించారు. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా తమిళ స్టార్ హీరో అయిన విక్రమ్ కూడా ఈ బాయ్‌కాట్‌ విషయంపై కాస్త కామెడీగా,వ్యంగంగా స్పందించారు.కాగా  కోలీవుడ్ హీరో విక్రమ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం కోబ్రా.అయితే  ఈ సినిమా ఆగస్ట్‌ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే ఈ నేపథ్యంలో తాజాగా హీరో విక్రమ్‌ మీడియాతో ముచ్చటించారు. అయితే ఈ నేపథ్యంలోనే బాయ్‌కాట్‌ గురించి స్పందించారు.

అంతేకాదు ఈ మధ్య కాలంలో బాయ్‌కాట్‌ మూవీస్‌ అంటూ పలు బాలీవుడ్‌ చిత్రాలను బహిష్కరించాలని నెటిజన్స్‌ ట్రోల్‌ చేస్తున్నారు. అయితే దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అని ఓ విలేకర్ ప్రశ్నించగా.. ఆ విషయం పై స్పందించిన విక్రమ్.. అసల్‌ బాయ్‌కాట్‌ అంటే ఏంటి? బాయ్‌ అంటే తెలుసు..గర్ల్‌ బాగా అంటే తెలుసు..అంతేకాదు  చివరకు కాట్‌ అంటే కూడా నాకు తెలుసు కానీ.. బాయ్‌కాట్‌ అనే పదమే నాకు తెలియదు అంటూ విక్రమ్‌ కాస్త వ్యంగంగా స్పందించాడు. కాగా విక్రమ్ నటించిన కోబ్రా సినిమాకు అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు.ఇక  ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: