
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అయింది. దాంతో తన తదుపరి సినిమాల విషయంలో కొంత జాగ్రత్త వహిస్తూ దానిని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి విజయ్ దేవరకొండ ఆలోచిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన శివ నిర్వాణ దర్శకత్వంలో చేస్తున్న ఖుషి సినిమాపై ఆచితూచి అడుగులు వేస్తూ ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధం చేస్తున్నాడు.
దర్శకుడుగా శివ నిర్వాణ మంచి సినిమాలే చేశాడు తొలి సినిమాతోనే ఒక సెన్సిటివ్ కథను హ్యాండిల్ చేసిన విధానం తో ఆయన ఎంత మంచి దర్శకుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ విధంగా శివ రెండవ సినిమా కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అలా మజిలీ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈ దర్శకుడు హ్యాట్రిక్ విజయాన్ని అందుకోలేకపోయాడని చెప్పాలి. నానితో కలిసి ఆయన చేసిన టక్ జగదీష్ అనే సినిమా ప్రేక్షకులను భారీ స్థాయిలో నిరాశపరచడంతో ఒకసారిగా శివ నిర్మాణ క్రేజ్ తగ్గిపోయింది.
దాంతో ఈసారి చేయబోయే సినిమా తప్పకుండా ప్రేక్షకులందరినీ అలరించాలని చెప్పి ఒక మంచి కథ పై దృష్టి సారించి విజయ్ దేవరకొండ తో ఈ ఖుషి అనే సినిమా చేస్తున్నాడు. ఇటు విజయ్ దేవరకొండ కూడా లైగర్ సినిమా పరాభవం నుంచి కోలుకోవాలని ఖుషీ సినిమాను హిట్టు చేయాల్సిందే అని భావిస్తున్నాడు. అందుకే శివ నిర్వాణ తో ఆయన ఈ సినిమా పట్ల బాగా కృషి చేస్తున్నాడు. సమంత కథనాయకగా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే సంగీతం పరంగా ప్రేక్షకులను భారీ స్థాయిలో ఆకట్టుకుంటుందని అంటున్నారు. మరి డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకొని విజయ్ దేవరకొండ స్టార్దమ్ ను నిలబడుతుందో చూడాలి.