మొన్నటికి మొన్న సినిమా రివ్యూలు చెబుతూ బాగా ఫేమస్ అయిన ఒక యువకుడు బుల్లితెర తో పాటు అటు సినిమాల్లో కూడా అవకాశాలు దర్శించుకుంటున్నాడు అనే విషయం తెలిసిందే. ఇక ఇటీవల కాలంలో సోషల్ మీడియాను ఒక యువతి బాగా ఊపేస్తోంది. బంగారం ఒకటి చెప్పనా అంటూ విచిత్రమైన డైలాగ్ చెప్పి తన హావభావాలతో అందరినీ నవ్విస్తుంది. ఈ క్రమంలోనే ఆ యువతి సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిపోయింది. దీంతో సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించిన ఆ యువతిని బుల్లితెర ఛానల్లో నిర్వాహకులు అందరు కూడా అస్సలు వదలడం లేదు.
తమ ఛానల్ లో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు పిలవడం ఆ యువతితో డైలాగులు చెప్పించడం రేటింగులు పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు జబర్దస్త్ నిర్వాహకులు కూడా ఇలాంటిదే చేశారు అని చెప్పాలి. ఇటీవల విడుదలైన జబర్దస్త్ ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఈ ప్రోమో చూసుకుంటే బంగారం ఒకటి చెప్పనా అనే డైలాగుతో ఫేమస్ అయిన యువతి చంటి స్కిట్ లో భాగంలో కనిపించింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో చెప్పిన డైలాగ్ స్టేజిపై కూడా చెప్పి అందరినీ కడుపుబ్బ నవ్వించింది అనే చెప్పాలి.