ఈ సినిమా లో ఆమె చూపించిన అందాలకు ప్రేక్షక లోకం ఫిదా అయ్యింది. ఈ ఒక్క సినిమా ద్వారా టాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది ఈ ముద్దుగుమ్మ. ఇక అప్పటినుంచి సెలక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్న పాయల్ కు యూత్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంది. ఆమె సోషల్ మీడియా లో కూడా చేసే అందాల హల్చల్ అంతా ఇంతా కాదు. రోజుకో కొత్త ఫోటో పెడుతూ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పాయల్ తన లేటెస్ట్ ఫోటో షూట్స్ తో ఫ్యాన్స్ కు గిలిగింతలు పెడుతూనే ఉంది.
తెలుగు లో ఆమె హీరోయిన్ గా మాత్రమే కాదు తేజ దర్శకత్వంలో కాజల్ హీరోయిన్ గా చేసిన సీత చిత్రంలో ఐటెం సాంగ్ చేసి యువతకు గిలిగింతలు పెట్టింది. ప్రస్తుతం ఆమె మంచు విష్ణు హీరో గా నటించిన జిన్నా సినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ ఇద్దరి కి ఇది ఎంతో కీలకమైన సినిమా అనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఇద్దరు కూడా గత సినిమాలతో ప్రేక్షకులను నిరాశపరిచాడు. ఇప్పుడు వారి కెరీర్ లు నిలబడాలంటే తప్పకుండా ఈ సినిమా తో విజయాలను అందుకోవాల్సిందే. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతుంది.