తమిళ స్టార్ హీరో విజయ్ కు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే.. తమిళ్ లోనే కాదు ఇక్కడ కూడా మంచి ఫ్యాన్స్ బేస్ ఉంది విజయ్ కు.. ప్రస్తుతం దళపతి విజయ్ తెలుగులో స్ట్రయిట్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్నాడు. వారసుడు అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ఈ తెరకెక్కుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా ఈ ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన వారసుడు ఫస్ట్ లుక్ తో ప్రేక్షకులని మెస్మరైజ్ చేశారు విజయ్. భారీ అంచనాలు వున్న ఈ కాంబినేషన్ ఫస్ట్ లుక్ తో ఆ అంచనాలని మరింత భారీగా పెంచింది. ‘వారసుడు’ చివరి షెడ్యూల్ షూటింగ్ తాజాగా ప్రారంభమైయింది. ఈ షూటింగ్ పూర్తి కావడానికి కేవలం 2 యాక్షన్ సీక్వెన్సులు, 2 పాటలు మాత్రనే మిగిలి వున్నాయి.శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొని ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతి కానుకగా భారీగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.


అన్ని వర్గాల ప్రేక్షలని ఆకట్టుకునే చిత్రాలను రూపొందించే ట్యాలెంటడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ కోసం యూనివర్సల్ సబ్జెక్ట్‌ని ఎంచుకున్నారు. ఈ చిత్రం కోసం బ్లాక్ బస్టర్ స్క్రిప్ట్‌ను తయారు చేసిన దర్శకుడు వంశీపైడిపల్లి విజయ్‌ని మునుపెన్నడూ చూడని క్యారెక్టర్‌లో ప్రెజెంట్ చేయనున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, శామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త ఈ లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్‌ సాల్మన్‌ కథ, స్క్రీన్ ప్లేను అందించారు.ఇక టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్నా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.ఇక ఈ సినిమా తెలుగులో విజయ్ కు మంచి బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి. రీసెంట్ గా విజయ్ బీస్ట్ సినిమాతో అట్టర్ ఫ్లాప్ ని ఎదురుకున్నాడు. మరి ఈ సినిమాతో ఎలాంటి విజయం సాధిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: