ప్రముఖ బాలివుడ్ హీరోయిన్ దీపికా పడుకొనే తీవ్ర అస్వస్థతకు గురైంది. తీవ్ర అసౌకర్యం కలగడంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేరింది. ఆమె ఆస్పత్రిలో చేరిన వెంటనే పలు రకాల పరీక్షలు నిర్వహించారు వైద్యులు. షూటింగ్ లో కాస్త అస్వస్థతకు గురవ్వడం వల్ల వెంటనే ఆసుపత్రిలో చేరారు.. ఇప్పుడు ఆమె పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. కాగా కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో ప్రభాస్‌ మూవీ ప్రాజెక్ట్ కె షూటింగ్‌కు హాజరైంది దీపిక.


ఆ సమయంలో ఆమె గుండె వేగంగా కొట్టుకోవడంతో కామినేని ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆ సమయంలో తీవ్ర పని ఒత్తిడితో దీపిక ఆరోగ్యం దెబ్బతింది. కాగా కొన్ని నెలల క్రితం దీపికకు కరోనా సోకింది. కరోనాను అధిగమించిన తర్వాత, ఆమె యూరోపియన్ పర్యటన కు వెళ్లింది. యూరప్ నుంచి తిరిగొచ్చాక ప్రభాస్ తో షూటింగ్ స్టార్ట్ చేసింది. ఈ హెక్టిక్ వర్క్ షెడ్యూల్ తన రక్తపోటుపై ప్రభావం చూపిందని నిర్మాత అశ్వినీదత్ తెలియజేశారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తోన్న ప్రాజెక్ట్‌- కేలో బిగ్‌ బీ అమితాబ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు.


ఇక ఈ సినిమాతో పాటు షారుక్‌ ఖాన్‌ హీరోగా నటిస్తోన్న పఠాన్‌లోనూ హీరోయిన్‌గా నటిస్తోంది దీపిక. ఈ సినిమాలో జాన్ అబ్రహం కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 25న థియేటర్లలోకి రానుంది. ఈ మూవీ హిందీ, తమిళ్‌, తెలుగు భాషల్లో విడుదల కానుంది. మరోవైపు హృతిక్ రోషన్ సరసన ఫైటర్ చిత్రంలోనూ దీపికనే హీరోయిన్‌గా నటించనుంది..ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే పూర్తి చేసి విడుదల చెయ్యాలని చిత్ర యూనిట్ భారీ ప్లాను చేస్తుంది.. ప్రస్తుతం దీపిక కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుని మళ్ళీ తిరిగి షూటింగ్ లో పాల్గొంటుందని సమాచారం..


మరింత సమాచారం తెలుసుకోండి: