పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి గురించి కొత్తగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆకాష్ పూరి తన చిన్నతనం లోనే ఎన్నో మూవీ లలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఆకాష్ పూరి సినిమాల్లో హీరోగా నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే ఆకాష్ పూరి అనేక మూవీ లలో హీరోగా నటించాడు. 

ఇది ఇలా ఉంటే ఆకాష్ పూరి కొంత కాలం క్రితం విడుదల అయిన రొమాంటిక్ మూవీ తో బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఆకాష్ పూరి 'చోర్ బజార్' అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ కి జీవన్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ 24 జూన్ 2022 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షోకే బాక్సా ఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ ని తెచ్చుకుంది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం పాలయ్యింది.

ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకో లేక పోయిన ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయినటు వంటి ఆహ 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. మ రికొన్ని రోజుల్లోనే చోర్ బజార్ మూవీ ని ఆహా 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా నిర్వాహక సంస్థ అధికారికంగా ప్రకటించింది. కాక పోతే ఈ మూవీ ని ఏ తేదీ నుండి స్ట్రీమింగ్ చేయబోతున్నది ఆహా సంస్థ ప్రకటించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: