నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అష్టా చమ్మా మూవీ తో నటుడిగా కెరియర్ ని మొదలు పెట్టిన నాని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరో గా కెరియర్ కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే నచురల్ స్టార్ నాని ఈ సంవత్సరం అంటే సుందరానికి మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ కి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించగా , మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా ఈ మూవీ లో నాని సరసన హీరోయిన్ గా నటించింది.

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అని రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నాని 'దసరా' అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , పూర్ణమూవీ లో ప్రతినాయక పాత్రలో కనిపించబోతుంది. ఈ మూవీ కి శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.

ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా దసరా మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ...  దసరా మూవీ నుండి ఫస్ట్ సింగిల్ ను మరి కొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నట్లు ,  ఈ సాంగ్ తెలంగాణ యాసలో ఉండే జానపద పాట అని ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్తకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలబడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: