మలయాళ  ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజుల్లోనే తన అందం అభినయంతో యువతలో మంచి క్రేజ్ తెచ్చుకుంది.

అనుపమకు హిట్‌ ప్లాప్‌లతో సంబంధం లేకుండా టాలీవుడ్ లో తన ఇమేజ్ను అంతకంతకు పెంచుకుంటూ ముందుకుపోతుంది. అనుపమ తన నటనతో ఎలాంటి పాత్రలోనైనా నటించగలదు కానీ ఈమెకు అదృష్టం కలిసి రాలేదనే చెప్పాలి.

 

ఈ ముద్దుగుమ్మ కెరియర్ ఆరంభంలో వరస హిట్‌లను తన ఖాతాలో వేసుకుంది. అనుపమ స్టార్ హీరోయిన్గా కొనసాగుతుందన్న టైంలో వరుస అపజయాలను తన ఖాతాలో వేసుకుంది. అప్పుడు నుంచి ఈమెకు ఏ సినిమా చేసిన విజయం సాధించలేకపోయింది. ఒకానొక టైంలో అనుపమ కెరియర్ క్లోజ్ అయిపోయిందని వార్తలు కూడా వచ్చాయి. అనుపమ తన కెరీర్ మొదటి నుంచి గ్లామర్ సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు అనుపమ ఎలాంటి సినిమాలు చేయడానికి అయినా సిద్ధమవుతుంది. మొన్నటికి మొన్న బెడ్ రూమ్ సీన్లతో లిప్ లాక్ సీన్లతో యువతలో హీట్ పుట్టించింది అనుపమా ఇలా చేసిన ఈ భామకు అవకాశాలు మాత్రం రావడం లేదని చెప్పొచ్చు.

స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు రాకపోవడంతో… అనుపమ కుర్ర హీరోల సినిమాలో నటించడానికి సిద్ధమై పోయిందని, ఈమె కన్నా చిన్న వారితో కూడా ఈమె నటించేందుకు సై అంటుంది. పోయిన సంక్రాంతికి అనుపమ రౌడీ బాయ్స్ సినిమాతో ఒక కుర్ర హీరోతో నటించింది. ఆ సినిమాలో అనుపమ లిప్ లాక్ లతో బెడ్ రూమ్ రొమాన్స్ తో నాన్న రచ్చ చేసింది మరి. తాజాగా నిఖిల్ హీరోగా కార్తికేయ 2 సినిమాలోను నటించింది. ఈ సినిమా అనుపమ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు మరోసారి నిఖిల్ తో 18 పేజెస్ అనే సినిమాలో ఈమె నటిస్తుంది. డిజె టిల్లు సినిమాతో సూపర్ క్రేజ్‌తెచ్చుకున్న సిద్దు జొన్నలగడ్డ ఆ సినిమాకు సీక్వల్ గా డీజె టిల్లు 2 తీస్తున్నాడు. ఈ సినిమాలో కూడా అనుపమ హీరోయిన్ గా ఎంపికైనట్టు తెలుస్తుంది. హిట్ లు కొడుతున్న కానీ స్టార్ హీరోలు అనుపమను పట్టించుకోవటం లేదు దీంతో అనుపమ ఏమీ చేయలేక కుర్ర హీరోలతోనే పని కాని చేస్తుంది అంట మరి..

మరింత సమాచారం తెలుసుకోండి: