రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా ఆది పురుష్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కృతి సనన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో విలన్ పాత్రలో సైఫ్ ఆలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి అయ్యి చాలా కాలం అవుతుంది. ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగ వంతంగా జరుగుతున్నాయి.

ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి చిత్ర బృందం ప్రభాస్ కి సంబంధించిన ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ ని మరియు ఒక టీజర్ ను విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఆది పురుష్ టీజర్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ రోజు ఆది పురుష్ మూవీ యూనిట్ ఈ సినిమా 3D వర్షన్ టీజర్ నీ హైదరాబాద్ లోని ఏ ఎం బి థియేటర్ లో విడుదల చేశారు. రేపు తెలుగు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ లలో ఆది పురుష్ మూవీ 3D వర్షన్ టీజర్ ని ప్రదర్శించనున్నారు.

ఇవాళ ఈ మూవీ 3D వర్షన్ టీజర్ ను ప్రభాస్ చూసాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఆది పురుష్ మూవీ టీజర్ ని చూసిన ప్రభాస్మూవీ టీజర్ గురించి మాట్లాడుతూ ...  నేను ఫస్ట్ టైమ్ చూసి చిన్న పిల్లాడిని అయిపోయాను. మంచి అనుభూతి కలిగింది. రేపు 60 థియేటర్ లలో ఈ మూవీ 3D వర్షన్ టీజర్ ని ప్రదర్శితం అవుతుంది.  ఫాన్స్ ఈ మూవీ టీజర్ లో చూసి థ్రిల్ అవుతారు. ఆది పురుష్ సినిమా బిగ్ స్క్రీన్ కోసమే చేశాం. త్వరలో మరో అద్భుతమైన కంటెంట్ తో వస్తాం అని ప్రభాస్ తాజాగా  చెప్పుకొచ్చాడు. ఆది పురుష్ మూవీ పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: