పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఈ సంవత్సరం భీమ్లా నాయక్ మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. భీమ్లా నాయక్ మూవీ లో పవన్ కళ్యాణ్ తో పాటు దగ్గుపాటి రానా కూడా మరో హీరో గా నటించాడు. ఈ మూవీ కి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించగా , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లో పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" మూవీ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు.

మూవీ కి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తూ ఉండగా , నిధి అగర్వాల్మూవీ లో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఎం ఎం కీరవాణిమూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ తమిళం లో సూపర్ హిట్ గా నిలిచిన తేరీ మూవీ ని తెలుగు లో రీమేక్ చేయబోతున్నట్లు గతంలో కొన్ని వార్తలు బయటికి వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే.

తేరి మూవీ తెలుగు లో పోలీసోడు పేరుతో విడుదల అయ్యి టాలీవుడ్ లో కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం తేరీ మూవీ కథలో కొన్ని మార్పులు మరియు చేర్పులను చేసి పవన్ కళ్యాణ్ కు దర్శకుడు హరీష్ శంకర్ వినిపించినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ ,  హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ అనే మూవీ లో నటించడానికి కమిట్ అయి ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్ కూడా మరి కొన్ని రోజుల్లోనే ప్రారంభం కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: