
విష్ణు చాలా ఎనర్జీటిక్ పర్సన్ తన యాక్టింగ్ చేయడం చాలా కంఫర్ట్ గా ఉంది. అలాగే పాయల్ తో యాక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది.ముఖ్యంగా హైదరాబాద్ బిర్యానీ రుచి చూశాను చాలా బాగుంది. ఇక్కడి ప్రేక్షకులు చక్కటి అభిమానం చూపుతారు.అలాగే నాకు .హైదరాబాద్, కొచ్చి, చెన్నయ్ ఇలా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ తో నాకు చాలా క్లోజ్ నెస్ పెరిగింది. ఇక్కడ నాకు విష్ణు ఫ్యామిలీ చక్కటి హస్పిటాలిటీ కల్పించారు. దర్శకుడు సూర్య నాకు చక్కటి ట్రాన్స్ లేట్ చేసుకొని తనకు ఏది కావాలో అది నా దగ్గర చక్కటి నటనను రాబట్టుకుంటాడు. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ లు చేసినా ప్రతి టీం డిఫరెంట్ వే లో వర్క్ చేస్తారు. ప్రస్తుతం నాలుగు ప్రాజెక్ట్స్ రెడీ గా ఉన్నాయి. అవన్నీ కుడాడిఫరెంట్ ప్రాజెక్ట్స్. చాలా క్యూరియాసిటీ గా ఉంది అలాగే డి గ్లామర్ రోల్ లో అనురాగ్ కష్యప్ తో హిందీలో ఒక చేస్తున్నాను. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న “జిన్నా” చిత్రం మాత్రం ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది” అంటూ చెప్పుకొచ్చారు.