నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న తాజా అప్డేట్ రానే వచ్చింది. బాలయ్య హీరోగా డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో ఒక యాక్షన్ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్గా శృతిహాసన్ కూడా నటిస్తున్నది. అయితే ఈ సినిమాకు టైటిల్ ఇంతవరకు ప్రకటించలేదు నిన్నటి రోజున రాత్రి ఈ సినిమా టైటిల్ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇక ఈ సినిమా టైటిల్ వీర నరసింహారెడ్డి అనే ఇంటెక్స్ అండ్ పవర్ ఫుల్ టైటిల్ రివిల్ చేసినట్లు తెలుస్తోంది. నిన్నటి రోజున సాయంత్రం కర్నూల్ లో కొండారెడ్డి బురుజు వద్ద విడుదల చేసినట్లు తెలుస్తోంది.


ఈ కార్యక్రమం కూడా చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఇక ఈ సినిమా టైటిల్ తో పాటు టీజర్ ని కూడా ప్రదర్శించారు. మొదటిసారి కొండారెడ్డి బురుజు వద్ద టైటిల్ ఆవిష్కరించడం అనేది తెలుగు సినీ పరిశ్రమలో మొదటిసారి అని చెప్పవచ్చు. వాస్తవానికి ఈ చిత్రానికి జై బాలయ్య, రెడ్డి గారు, అన్నగారు,వీరసింహారెడ్డి అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. కాని చివరికి మాత్రం దర్శకులు వీర నరసింహారెడ్డి అనే టైటిల్ ని ఎక్కువ మక్కువ చూపడంతో వీటిని ఫిక్స్ చేశారు.

వాస్తవానికి బాలయ్య నటించిన నరసింహనాయుడు , సమరసింహారెడ్డి, సింహా వంటి సినిమాలు మెజారిటీ చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇదే తరహాలో ఇప్పుడు వీర నరసింహరెడ్డి అనే టైటిల్ డిజైన్ చేయడంతో ఈ చిత్రం కూడా ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని నమ్మకాన్ని తెలియజేస్తున్నారు అభిమానులు. బాలకృష్ణను భయంకరమైన మాస్ అవతారంలో ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ఇక పోస్టర్ విషయానికి వస్తే పులిచెర్ల 4 కిలోమీటర్లు మైలురాయిపై బాలయ్య కాలు పెట్టి చాలా స్టైలిష్ గా నిలబడి ఉంటూ పక్కనే తన ఆదాయాన్ని చూపిస్తూ ఏదో వేటకు సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: