తమిళ సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న సూపర్ స్టార్ రజనీ కాంత్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రజనీ కాంత్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి కేవలం తమిళ్ లో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకొని , ఎంతో మంది అభిమానుల మనసు కూడా దోచుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీ కాంత్ "జైలర్" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ,  రమ్య కృష్ణ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. అలాగే ఈ మూవీ లో కోలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయిన శివ కార్తికేయన్ అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఈ మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం.

మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇలా జైలర్ మూవీ సెట్స్ పై ఉండగానే సూపర్ స్టార్ రజనీ కాంత్ , లైకా మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ లో మరో రెండు సినిమాలలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం లైకా మూవీ సంస్థ లో రజనీ కాంత్ నటించబోయే రెండు సినిమాల పూజా కార్యక్రమాలు కూడా ఒకే రోజు జరగబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం లైకా ప్రొడక్షన్ సంస్థ లో రజనీ కాంత్ నటించబోయే రెండు సినిమా పూజా కార్యక్రమాలు నవంబర్ 5 వ తేదీన చెన్నై లో జరగబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: