గాడ్ ఫాదర్ సినిమా తర్వాత వెంటనే మరో సినిమాను ఫ్యాన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు అన్ని సిద్ధం చేస్తున్నాడు. చిరు చేస్తున్న సినిమాల్లో వాల్తేరు వీరయ్య ఒకటి.. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఇటీవలే కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసారు. రాజమండ్రి లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసి మెగాస్టార్, రవితేజ మధ్య కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
ఇక ఈ సినిమా లో మెగా స్టార్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాతో మెగాస్టార్ వింటేజ్ లుక్ వైరల్ అవుతుంది. బోస్ ఈజ్ బ్యాక్ అనే రేంజ్ లోకి ఈ లుక్ వెళ్ళిపో యింది. ఇక తాజాగా స్టూడెంట్స్ మెగా ట్రిబ్యూట్ చుసిన వారంతా ఫిదా అవుతున్నారు.. ఈ క్రమం లోనే డైరెక్టర్ బాబీ మెగా ట్రిబ్యూట్ వీడి యోను షేర్ చేస్తూ తన ఆనందం వ్యక్తం చేసాడు..
దాదాపు 6 వేల మంది స్టూడెంట్స్ కలిసి కాలే జ్ గ్రౌండ్ లో మెగా స్టార్ రూపం తీర్చిదిద్ది మెగా ట్రిబ్యూ ట్ అందించారు. ఈమెగాస్టార్ పిక్ గెటప్ లో స్టూడెంట్స్ అంతా కూర్చుని అదరగొట్టారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇది కదా మెగా ట్రిబ్యూ ట్ అంటూ ఫ్యాన్స్ సైతం ఆనందిస్తున్నారు. దీంతో ఈ వీడియోను బాబీ కూడా షేర్ చేస్తూ ఆ స్టూ డెంట్స్ కు యాజమా న్యానికి థాంక్స్ తెలిపారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి