తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటు వంటి కార్తీ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కార్తీ ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లలో హీరోగా నటించిన తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే కార్తీ ఇప్పటికే ఎన్నో మూవీ లను తెలుగు లో కూడా విడుదల చేసి , టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు ను దక్కించుకున్నాడు. తాజాగా కార్తీ "సర్దార్" అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ లో కార్తీ డ్యూయల్ రోల్ లో నటించాడు. ఒక పాత్రలో కార్తీ పోలీస్ ఆఫీసర్ గా నటించగా , మరో పాత్రలో స్పై ఏజెంట్ గా నటించాడు  ఈ మూవీ లో రాశి ఖన్నా , రాజేష విజయన్ హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ కి పి ఎస్ మిత్రన్ దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే తమిళ్ మరియు తెలుగు భాషలలో విడుదల అయింది. ఈ మూవీ కి తమిళ్ మరియు తెలుగు భాషలలో మంచి కలెక్షన్ లు లభించాయి. ఈ మూవీ దాదాపు 100 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసినట్లు ,  మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే కార్తీ హీరోగా తెరకెక్కిన సర్దార్ మూవీ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లాక్ అయ్యింది.

తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ "ఓ టి టి" హక్కులను ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ దక్కించుకుంది. ఈ మూవీ ని ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా "ఓ టి టి"  సంస్థ తాజాగా ప్రకటించింది. కాకపోతే ఏ తేదీన ఈ మూవీ ని స్ట్రీమింగ్ చేయబోతున్నారు అనే విషయాన్ని మాత్రం ఆహా "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ ప్రకటించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: