దీనికికారణం సంక్రాంతి రేస్ కు రాబోతున్న దిల్ రాజ్ సొంత సినిమా ‘వారసుడు’ అని అంటున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజ్ నిర్మిస్తున్న ఈమూవీ తమిళ తెలుగు భాషలలో ఒకేసారి సంక్రాంతికి విడుదల కాబోతోంది. వాస్తవానికి తమిళ హీరో విజయ్ నటిస్తున్న ఈమూవీని తెలుగులో డబ్బింగ్ సినిమాగా విడుదల చేస్తున్నారు.
గతంలో దిల్ రాజ్ సంక్రాంతి రేస్ లో డబ్బింగ్ సినిమాల విడుదల ఉండ కూడదు అంటూ అనేక సార్లు ఓపెన్ గానే చెపుతూ ఉండేవాడని టాక్. అయితే ఇప్పుడు అదే దిల్ రాజ్ సంక్రాంతి రేస్ లో ‘వాల్టేర్ వీరయ్య’ బాలకృష్ణ ‘వీర సింహారెడ్డి సినిమాలతో పోటీగా దిల్ రాజ్ డబ్బింగ్ సినిమా విడుదల ఏమిటి అంటూ ఇండస్ట్రీలోని ఒక వర్గం దిల్ రాజ్ ను టార్గెట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇది ఇలా ఉంటే సంక్రాంతికి విడుదలకాబోతున్న బాలయ్య చిరంజీవి సినిమాలను నిర్మించిన మైత్రీ మూవీస్ సంస్థ తామే సొంతంగా ఒక డిస్ట్రిబ్యూ సంస్థను ఏర్పాటు చేసి తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా నైజం ప్రాతంలో తమ సినిమాలను తామే విడుదల చేసుకుని దిల్ రాజ్ హవాను కొంతవరకు తగ్గించాలి అని చేస్తున్న ప్రయత్నాలు వల్ల సంక్రాంతి సినిమాల రేస్ లో ధియేటర్ల వార్ కొనసాగుతోంది అంటూ ఇండస్ట్రీలో వార్తల గడావిడి జరుగుతోంది. దీనితో రాబోతున్న సంక్రాంతి వార్ కొందరి ఇగోల మధ్య వార్ గా మారుతూ ఉండటంతో ఈ వార్ లో సంక్రాంతి విజేత ఎవరు అన్న ఆశక్తి ఇండస్ట్రీ వర్గాలలో పెరిగిపోతోంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి