సాధారణంగా ఏ విషయంలో కామెడీ చేసినా.. ఆర్మీ, జవాన్ల విషయంలో ఎప్పుడూ తప్పు మాట్లాడకూడదు. వారిని హేళన చేసినట్లుగా కామెంట్స్ చేయకూడదు అని ఎప్పటికప్పుడు ఏదొక సందర్భంలో చెబుతూనే ఉంటారు. స్కూల్స్, కాలేజీ దశలోనే విద్యార్థులకు ఉపాధ్యాయులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు ఏయే విషయాలపై ఎలా స్పందించాలి.. ఎలా మాట్లాడాలి అనేవి నేర్పుతుంటారు. సామాన్యులంటే ఏం మాట్లాడిన అవి మీడియా వరకు వెళ్లపోవచ్చు. కానీ.. సెలబ్రిటీ హోదాలో ఉన్నవారు ఏమాత్రం నోరుజారినా, గౌరవించాల్సిన విషయాలను అగౌరవ పరిచినా ఎదుర్కోవాల్సిన పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.

ప్రస్తుతం అలాంటి పరిస్థితినే ఫేస్ చేస్తోంది బాలీవుడ్ హీరోయిన్ రిచా చద్దా. ఇటీవల ‘పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి పాకిస్థాన్ ని వెనక్కి పంపేందుకు పూర్తి సిద్ధం అయ్యామని, ప్రభుత్వం ఆర్డర్ పాస్ చేస్తే ఆపరేషన్ త్వరగా ముగిస్తాము’ అంటూ నార్త్ కమాండింగ్ ఇన్ చీఫ్ తెలిపారు. ఈ విషయంపై స్పందించిన రిచా.. “గాల్వాన్ హాయ్ చెబుతోంది” అని పోస్ట్ పెట్టింది. దీంతో గాల్వాన్ ఘటనలో భారత సైనికులు 20 మంది మరణించారు. వాళ్ళ త్యాగాన్ని అవమానపరిచే విధంగా పోస్ట్ చేయడం కరెక్ట్ కాదని.. రిచా పోస్ట్ పై మండిపడుతున్నారు నెటిజన్స్, సినీ సెలబ్రిటీలు. ప్రస్తుతం రిచా చేసిన విషయం చర్చనీయాంశంగా మారింది.రిచా  ప్రత్యర్థి దేశానికి మద్దతుగా ఉన్నాయని కామెంట్స్ చేస్తూ.. ఆమెపై తీవ్ర విమర్శలు చేస్తూ, వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. దీంతో తాను చేసిన డిలేట్ చేసి.. “తాను ఎవ్వరినీ ఉద్దేశించి ఆ  పెట్టలే దు. ఎవరినైనా బాధించి ఉంటే క్షమించండి” అని కోరింది. అయితే.. రిచా పోస్ట్ పై ఇప్పటికే హీరోలు మంచు విష్ణు, అక్షయ్ కుమార్ స్పందించారు. తాజాగా యంగ్ హీరో నిఖిల్ రిచా చద్దా  పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మన దేశాన్ని, మనల్ని కాపాడేందుకు గాల్వాన్ లో 20 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. వారి గురించి ఆలోచిస్తే ఇప్పటికీ కన్నీళ్లు ఆగవు. అలాంటివారిని గౌరవించాలి. రాజకీయాలు మర్చిపోండి. దేశం తర్వాతే ఏదైనా అని తెలుసుకోండి’ అని రిచాపై ఫైర్ అయ్యాడు. ప్రస్తుతం నిఖిల్  నెట్టింట వైరల్ అవుతోంది. మరి రిచా చద్దా వివాదంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: