టాలీవుడ్  యంగ్  అండ్  టాలెంటెడ్  డైరెక్టర్  ప్రశాంత్  వర్మపై ప్రశంసలు కురిపించారు లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. ఈమధ్యనే విడుదలైన హనుమాన్  టీజర్  చూసిన ఆయన..విజువల్స్  చాలా అద్భుతంగా ఉన్నాయన్నారు. యానిమేషన్ విజువల్స్  ఇంకా అలాగే కెమెరా పనితనం చాలా అద్భుతంగా ఉన్నాయని.. టీజర్  స్టార్టింగ్లోనే భారీ హనుమంతుడి విగ్రహాన్ని చూస్తుంటే.. నిజంగానే ఆయన్ని చూస్తున్నామా అనిపించేలా ఉందని.. ఎంతో భక్తిభావం కలుగుతుందని ఆయన అన్నారు.. ఈ మూవీ డైరెక్టర్  ప్రశాంత్  వర్మకు హ్యాట్సాఫ్  అంటూ సింగీతం శ్రీనివాస రావు పొగిడారు. ఇక హనుమాన్ టీజర్  చూసిన కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కూడా ఫిదా అయ్యారు. పనితనం చాలా బాగుందని.. హనుమాన్ టీజర్.. మాస్సీ..క్లాసీ అని.. ఫాంటసీ ఫ్యామిలీ ఎంటర్టైనర్.. తేజా సజ్జా.. అమ్రిత సూపర్ వర్క్ అంటూ  సోషల్ మీడియా ద్వారా పోస్ట్  చేశారు.


సినిమా టీజర్  చూస్తుంటే ప్రశాంత్  వర్మ,అతని టీం మాస్టర్ వర్క్  అనేది ప్రతి ఫ్రేమ్‌లో కూడా కనిపిస్తుంది. 121 సెకన్ల టీజర్  విజువల్ వండర్ గా ఏకంగా అంజనాద్రి ప్రపంచంలోకి తీసుకెళ్లింది.తెలుగులో ఫస్ట్ జాంబీ సినిమా జాంబీ రెడ్డి ని రూపొందించిన క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో లను తెరపై చూపించడానికి ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌ ని సృష్టించాడు. హనుమాన్  సినిమా టీజర్  చూసాకా ఈ సినిమాపై అంచనాలు ఆకాశానికి తాకాయి. ఎప్పుడెప్పుడు ని బిగ్ స్క్రీన్‌లపై చూడాలనే ఆసక్తి అనేది నెలకొంది. హను-మాన్ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మేకర్స్ త్వరలో ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఈ సినిమా ఇండియాస్ నెక్స్ట్ బిగ్  థింగ్  అని నెటిజన్స్  కొనియాడుతున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా దేశానికి గర్వ కారణంగా నిలుస్తుందని కొనియాడుతున్నారు.చూడాలి ఈ సినిమా ఎన్ని రికార్డులను నమోదు చేస్తుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: