నటుడిగా , దర్శకుడిగా తనకంటూ అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటు వంటి ఎస్ జె సూర్య గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే అనేక మూవీ లలో నటించడం మాత్రమే కాకుండా అనేక సినిమాలకు దర్శకత్వం వహించి నటుడి గా , దర్శకుడి గా తనకంటూ ఒక అద్భుతమైన ఇమేజ్ ను ఎస్ జె సూర్య సొంతం చేసుకున్నాడు. ఎస్ జె సూర్య తమిళ్ మరియు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. ఇది ఇలా ఉంటే సూర్య తెలుగు లో కూడా కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఎస్ జే సూర్య తెలుగు లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా తెరకెక్కిన ఖుషి , కొమరం పులి మూవీ లకు దర్శకత్వం వహించగా , సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా తెరకెక్కిన నాని మూవీ కి దర్శకత్వం వహించాడు.

మహేష్ బాబు హీరో గా తెరకెక్కిన నాని మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక పోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా నాని మూవీ గురించి ... ఆ సినిమా రిజల్ట్ గురించి ఎస్ జే సూర్య స్పందించాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు కు హిట్ మూవీ ఇవ్వనందుకు తాను ఇప్పటికీ బాధపడుతున్నాను అని అన్నాడు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు హిట్ ఇచ్చి సూపర్ స్టార్  మహేష్ బాబుకు హిట్ ఇవ్వలేకపోయాను అని ఇప్పటికీ బాధపడుతున్నారు అని తాజాగా ఎస్ జె సూర్య తాజాగా తెలియజేశాడు. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో ఎస్ జె సూర్య మూవీ లకు దర్శకత్వం వహించడం కంటే కూడా , మూవీ లలో నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: