సాధారణంగా ఒక యంగ్ హీరో విజయం సాధిస్తే మిగతా స్టార్ డైరెక్టర్లు.. యంగ్ డైరెక్టర్లు.. నిర్మాతలు ఆ హీరో చూట్టూ మూగుతూ ఉంటారు. అదే ఫ్లాప్ సాధించాడు అంటే అతని వైపు చూడడం కూడా మానేస్తారు. సరిగ్గా ఇలాంటి విషయమే ప్రస్తుతం డైరెక్టర్ల విషయంలో కూడా జరుగుతోందని చెప్పడంలో సందేహం లేదు. మొన్నటికి మొన్న ఆచార్య సినిమాతో డిజాస్టర్ ను చవిచూసిన ఫ్లాపే ఎరుగని డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేయాలంటే హీరోలు సైతం తడబడ్డారు. అలాగే త్రివిక్రమ్ తో కూడా సినిమాలు చేయడానికి చాలామంది హీరోలు వెనుకడుగు వేసిన విషయం తెలిసిందే.


ఇప్పుడు ఇదే గడ్డు కాలాన్ని డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కూడా ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.  తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా సినిమా లైగర్ ను తెరకెక్కించి భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా పూర్తిస్థాయిలో డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఫలితం కేవలం హీరో పైనే కాదు దర్శకులపై కూడా భారీ స్థాయిలో పడిందని చెప్పవచ్చు.. అయితే పూరీ జగన్నాథ్ తన తదుపరి చిత్రాన్ని విజయ్ దేవరకొండ తోనే తెరకెక్కించాలని అనుకున్నారు. కానీ విజయ్ దేవరకొండ తో తీసిన మొదటి సినిమా ఫ్లాప్ అవడంతో ఆయన తన ఆలోచనను మానుకున్నారు.

అయితే నిన్నటి వరకు మాస్ మహారాజా తో తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నారు అని పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.  కానీ ఇందులో నిజం లేకపోయింది. తాజాగా ఆయనతో ఎవరు తన తదుపరి చిత్రాన్ని చేస్తారు అనేది ప్రశ్నార్థకంగా మారింది.  కొత్త హీరోలు కూడా పూరీ జగన్నాథ్ కి అవకాశం ఇవ్వడం లేదు. అంతేకాదు అతను సంప్రదించిన ప్రతి హీరో కూడా కొత్త షరతును విసురుతున్నాడు అని సమాచారం. దీన్ని బట్టి చూస్తే ఆయనకు ఇది పరీక్షా కాలమని చెప్పవచ్చు.  మరి ఈ పరీక్షా కాలం నుంచి పూరీ జగన్నాథ్ ఎలా గట్టెక్కుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: