అలనాటి కాలంలో ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి తన అంద చందాలతో , డ్యాన్స్ తో , నటన తో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకుని ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగిన మీనా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మీరా ఈ మధ్య కాలంలో కూడా సినిమాల్లో ముఖ్య పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అందులో భాగంగా తాజాగా మీనా , విక్టరీ వెంకటేష్ హీరో గా తెరకెక్కిన దృశ్యం 2 మూవీ లో వెంకటేష్ భార్య పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించింది.

దృశ్యం 2 మూవీ థియేటర్ లలో కాకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే మీనా భర్త చనిపోయిన విషయం మనకు తెలిసింది. దానితో మీనా రెండవ పెళ్లికి సిద్ధం అయ్యింది అని , త్వరలోనే మీనా రెండో పెళ్లి చేసుకోబోతుంది అని అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఈ వార్తలపై రోజా సన్నిహితులు చాలా ఘాటుగా స్పందించారు.

డబ్బు మరియు ప్రాపులారిటీ కోసం ఏమైనా రాస్తారా , సోషల్ మీడియా రోజు రోజుకు చాలా దిగజారి పోతుంది. నిజాలు తెలుసుకొని రాస్తే మంచిది. ఇలా అసత్య వార్తలు రాస్తే వాళ్ళపై చర్యలు తీసుకుంటాం అని మీనా గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు ఆమె సన్నిహితులు తెలియజేశారు. దయచేసి ఇలాంటి పుకార్లను సృష్టించి ఆమె ప్రైవసీకి భంగం కలిగించద్దు అని కూడా మీనా సన్నిహితులు విజ్ఞప్తి చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: