బిగ్ బాస్ 6 సీజన్ లో ప్రముఖ సింగర్ రేవంత్ కూడా వున్నాడు.. అతనికి ఈ ఏడాదిలోనే పెళ్ళి అయిన విషయం తెలిసిందే.. అయితే తాజాగా తండ్రి అయ్యాడు.రెండు రోజుల క్రితం అతను భార్య ఆడ బిడ్డకు  జన్మనిచ్చింది.ప్రస్తుతం బిగ్‌బాస్‌ హౌస్‌లో కంటెస్టెంట్‌గా ఉన్నాడు రేవంత్‌. బిడ్డ పుట్టిన గుడ్‌న్యూస్‌ ను బిగ్‌బాస్‌ సింగర్‌ కు తెలియజేయడం తో అతను ఆనందం తో ఉబ్బితబ్బిబ్బై పోయాడు. తాజాగా రేవంత్‌కి జీవితాంతం గుర్తుండిపోయే మధురజ్ఞాపకాల ను అందించాడు బిగ్‌బాస్‌. అతనిని కన్ఫెషన్ రూంకి పిలిచిన బిగ్ బాస్.. ‘రేవంత్ మీకో శుభవార్త.. మొన్న రాత్రి 11.51 నిమిషాలకు మీకు కూతురు జన్మించింది' అని చెప్పారు.
 

అంతేకాకుండా లైవ్‌ లో తన పాపను కూడా చూపించాడు. పాపను, భార్యను చూసి రేవంత్ ఎమోషనల్ అయ్యాడు. అతని ఆనందాని కి అవధుల్లేకుండా పోయాయి. ఇక ఇది చాలు బిగ్ బాస్ అంటూ ఎమోషనల్‌ అయ్యాడు. జూనియర్ రేవంత్ పుట్టిందని చెప్పు అంటూ తన బిడ్డను చూసుకుంటూ భార్య తో మాట్లాడాడు. అనంతరం.. ‘పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా’ అంటూ పాట పాడి ఎమోషనల్ అయ్యాడు.. నేను ఇక్కడే గెలిచాను బిగ్ బాస్ అంటూ థ్యాంక్స్ చెప్పాడు.


బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌ తుది దశకు చేరుకుంది. పదమూడో వారానికి గానూ రేవంత్, ఆదిరెడ్డి, కీర్తి, శ్రీసత్య,రోహిత్, ఫైమా నామినేషన్‌ లిస్టులో ఉన్నారు. ఇక ఓటింగ్‌ లో రేవంత్ ముందుండగా.. రోహిత్‌ రెండోప్లేసు లో ఉన్నాడు. కామన్‌ మ్యాన్‌ ఆదిరెడ్డి థర్డ్ ప్లేసు లో ఉండగా.. కీర్తి నాలుగో స్థానం లో ఉంది. ఇక ఐదో స్థానంలో శ్రీసత్య ఉంటే.. ఫైమా లీస్ట్ ఓటింగ్‌తో ఆఖరి స్థానంలో ఉంది. దీంతో ఈ వారంలో ఫైమా ఎలిమినేట్ అవుతందనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది..మరింత సమాచారం తెలుసుకోండి: