రాబోయే సంక్రాంతి రేస్ చిరంజీవి బాలకృష్ణ ల మధ్య రేస్ గా మారడంతో వారి సినిమాలలో ఏసినిమా ముందు వస్తుంది మరే సినిమా వెనక వస్తుంది అన్న ఆసక్తికి తెర పడింది. ఈ సంవత్సరం సంక్రాంతి రేస్ ను బాలయ్య ప్రారంభిస్తున్నాడు. భారీ అంచనాలతో విడుదల అవుతున్న ‘వీరసింహారెడ్డి’ మూవీని జనవరి 12న విడుదల చేస్తున్నారు.


ఇప్పుడు ఈ డేట్ ను బాలయ్య ఎంచుకోవడం వెనుక ఒక సెంటిమెంట్ ఉంది. బాలకృష్ణ 100వ సినిమాగా విడుదలైన ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ జనవరి 12న అప్పట్లో సంక్రాంత్రి రేస్ కు విడుదలై విజయం సాధించిన నేపధ్యంలో ఇప్పుడు మళ్ళీ అదే సెంటిమెంట్ డేట్ ను రిపీట్ చేస్తున్నారు. అప్పట్లో చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ మ్యానియాను తట్టుకుని బాలయ్య ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ నిలబడిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందని బాలయ్య అభిమానులు భావిస్తున్నారు.


సంక్రాంతి రేస్ బాలయ్య సినిమాతో ప్రారంభం అవుతున్న పరిస్థితులలో ఈమూవీ విడుదల తరువాత ఒక్కరోజు గ్యాప్ తో చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ ధియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే ఈ రెండు సినిమాలకు సంబంధించిన ధియేటర్ల విషయంలో పోటీ ఏర్పడింది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం బాలయ్య సినిమా కంటే చిరంజీవి సినిమాకి ఎక్కువ ధియేటర్లు దొరికాయి అని వస్తున్న వార్తలు విని బాలయ్య అభిమానులు ఖంగారు పడుతున్నారు.


ఇది ఇలా ఉంటే సీనియర్ హీరోలు నటిస్తున్న ఈ రెండు భారీ సినిమాలలోను వారి కంటే చాల తక్కువ వయస్సు ఉన్న శృతి హాసన్ హీరొయిన్ గా నటించడం సంచలనంగా మారింది. ఈ రెండు సినిమాలు తరువాత శృతి సీనియర్ హీరోల హీరోయిన్ గా మారిపోయే ఆస్కారం కనిపిస్తోంది. సంక్రాంతికి విడుదల అవుతున్న ఈ రెండు సినిమాలు భారీ మాస్ సినిమాలు కావడంతో ఈ మాస్ సినిమాల వార్ లో ఏ మాస్ హీరో సంక్రాంతి విజేతగా మారుతాడో చూడాలి..మరింత సమాచారం తెలుసుకోండి: