టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ లలో ఒకరు అయినటు వంటి పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పూరి జగన్నాథ్ ఇప్పటికే అనేక బ్లాక్ బాస్టర్ మూవీ లకు దర్శకత్వం వహించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే కొంత కాలం పాటు వరుస పరాజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర ఎదుర్కొన్న పూరి జగన్నాథ్ "ఈస్మార్ట్ శంకర్" మూవీ తో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. అలా ఈస్మార్ట్ శంకర్ మూవీ తో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన పూరి జగన్నాథ్ తాజాగా లైగర్ మూవీbకి దర్శకత్వం వహించాడు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా రూపొందిన లైగర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయం చెందింది.

ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం పూరి జగన్నాథ్ , నందమూరి నటసింహం బాలకృష్ణ తో ఒక మూవీ చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా పూరి జగన్నాథ్ , బాలకృష్ణ కోసం ఇప్పటికే ఒక అదిరిపోయే మస్ యాక్షన్ ఎంటర్టైనర్ కథను కూడా రెడీ చేశాడట. కాకపోతే ప్రస్తుతం బాలకృష్ణ వరుస కమిట్మెంట్ లతో ఫుల్ బిజీగా ఉండడం తో బాలకృష్ణ తో ఇప్పుడు మూవీ చేస్తే అవకాశం లేనందున ఆ గ్యాప్ లో పూరి జగన్నాథ్ ,  రవితేజ తో ఒక మూవీ చేయాలి అని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది వరకే పూరి జగన్నాథ్ , రవితేజ కాంబినేషన్ లో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ,  అమ్మానాన్న ఓ తమిళమ్మాయి , ఇడియట్ ,  దేవుడు చేసిన మనుషులు మూవీ లు తెరకెక్కయి. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ లలో ఎక్కువ శాతం మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాలను అందుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: