మూవీ ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ ఫీల్డ్ అనే సంగతి తెలిసిందే.. ఇక్కడ ఎప్పుడు ఎవరికీ అవకాశం వరిస్తుందో చెప్పలేం.. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఎవరికీ ఎప్పుడు లక్ కలిసి వస్తుందో కానీ చెప్పలేం..

కొంత మందికి ఎంత టాలెంట్ ఉన్న వారికీ అవకాశం రావడానికి సమయం పడుతుంది.. ఇంకొంత మందికి మాత్రం లక్ కలిసి వస్తే వెంటనే అవకాశాలు కూడా వరిస్తాయి..

మరి ఇప్పుడు ఒక బ్యూటీ పరిస్థితి కూడా ఇలానే ఉంది.. విజయ్ దేవరకొండతో టాక్సీవాలా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ప్రియాంక జవల్కర్.. ఈ సినిమా హిట్ కూడా అయ్యింది.. మొదటి సినిమాతోనే ఈ అమ్మడు యూత్ ను బాగానే ఆకట్టుకుంది.. అయితే ఈ సినిమా విజయంతో ఈ అమ్మడికి వరుస అవకాశాలు వస్తాయి అనుకున్నారు.. కానీ అది అయితే జరగలేదు.. చిన్న చిన్న సినిమాలు కూడా చేస్తున్న గుర్తింపు మాత్రం అస్సలు పొందలేదు.

అందం, అభినయం అన్ని ఉండి స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ లు ఉన్న ఈ అమ్మడికి లక్ కలిసి రాలేదు.. కానీ తాజాగా ఈ అమ్మడికి బాలయ్య 108వ సినిమాలో ఆఫర్ వచ్చినట్టు కూడా తెలుస్తుంది.. 

దీంతో ఈ సినిమా ఆఫర్ తో ఈ అమ్మడి లక్ మారుతుంది అని అనుకుంటున్నారు.అయితే ఈ అమ్మడు ఈ ఆఫర్ రాగానే ఓకే చెప్పిన ఆ తర్వాత ఆలోచనలో పడిందట..బాలయ్య లాంటి సీనియర్ హీరోతో సినిమా చేస్తే యంగ్ హీరోల సరసన ఛాన్సులు రాకపోవచ్చు అనే టాక్ కూడా వస్తుంది. ఈమె కు తన కెరీర్ కు ఈ సినిమా ప్లస్ అవుతుందా లేదా మైనస్ అవుతుందా అనే ఆలోచనలో కూడా ఉందట.. మరి ఈమెకు ఈ అవకాశం ఎలా మారుతుందో చూడాలి.. ఇక బాలయ్య 108వ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాను అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్నాడని సమాచారం... ఇందులో శ్రీలీల బాలయ్య కూతురుగా నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు కూడా వెళ్లనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: