‘పుష్ప’ మూవీ ఎవరూ ఊహించని విధంగా అల్లు అర్జున్ ను పాన్ ఇండియా స్టార్ గా మార్చివేయడంతో అతడి రేంజ్ విపరీతంగా పెరిగిపోయింది. దీనికి తగ్గట్టుగా బన్నీ కూడ తన పెరిగిన క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఆక్రేజ్ ను మరింత పెంచుకునే విధంగా చాలవ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడు. ముంబాయిలో ఒక ప్రత్యేకమైన పిఆర్ టీమ్ ను ఏర్పాటు చేసుకుని బాలీవుడ్ లో తన ఇమేజ్ ని పెంచుకోవడం కోసం బన్నీ చాలతెలివిగా వ్యవహరిస్తున్నాడు అన్నవార్తలు ఇప్పటికే వస్తున్నాయి.


ఇలాంటి పరిస్థితుల మధ్య అల్లు అర్జున్ మ్యానియా పెంచడానికి అతడి కుటుంబ సభ్యుల సొంత నిర్మాణ సంస్థ అయిన గీతా ఆర్ట్స్ కూడ చాల తెలివిగా వ్యవహరిస్తోంది అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఆమధ్య జరిగిన అల్లు శిరీష్ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు బన్నీ ముఖ్య అతిధిగా రావడంతో అతిధులు అంతా ఆసినిమా హీరో అల్లు శిరీష్ కంటే బన్నీ ఆకాశానికి ఎత్తేస్తూ పొగడ్తల వర్షం కురిపించడంతో ఆమూవీ ఫంక్షన్ బన్నీ సన్మాన సభగా మారిపోయిందని అప్పట్లో కామెంట్స్ వినిపించాయి.


ఇప్పుడు మళ్ళీ అదే సీన్ మరొక చోట రిపీట్ అయింది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈవారం విడుదల కాబోతున్న నిఖిల్ ’18 పేజస్’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు బన్నీని ముఖ్య అతిధిగా పిలిచారు. దీనితో అందరి దృష్టి అల్లు అర్జున్ పై పడటంతో పాటు అతడి వీరాభిమానులు ఏకంగా వేదిక పైకి వచ్చి ఆలు అర్జున్ కు పాదనమస్కారాలు చేయడమే కాకుండా ‘బన్నీ అన్నా’ అంటూ చేసిన హడావిడి మధ్య నిఖిల్ సినిమా గురించి కాకుండా సోషల్ మీడియాలో బన్నీ మ్యానియా పై చర్చలు జరుగుతున్నాయి.


అల్లు అర్జున్ చాల వ్యూహాత్మకంగా మెగా అభిమానులుల హోల్డ్ నుండి బయటకు వచ్చి తన అభిమానులకు ముచ్చటగా ‘అల్లు ఆర్మీ’ అని పేరు పెట్టుకుని తన అభిమానుల మధ్య తన హోల్డ్ ను బాగా పెంచుకుంటున్నాడు. అయితే ఇలా అతడి ఇమేజ్ ను పెంచుకునే విషయంలో పాద నమస్కారాలు చేయించుకోవడం అతడి వయసు రీత్యా ఇప్పుడు అవసరమా అంటూ కొందరు బన్నీని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు..
మరింత సమాచారం తెలుసుకోండి: