తెలుగు సినిమా ఇండస్ట్రీలో హిట్ ... ఫ్లాపులతో ఏ మాత్రం సంబంధం లేకుండా వరుస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తున్న యువ హీరోలలో ఒకరు అయినటువంటి కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హీరో వరుస మూవీ లతో ప్రేక్షకులను పలకరిస్తూ వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ హీరో వినరో భాగ్యము విష్ణు కథ అనే మూవీ లో హీరోగా నటించాడు. మురళీ కిషోర్ అబ్బోరు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో కాశ్మీరా పరదేశి ఒక కీలకమైన పాత్రలో నటించింది.

మూవీ ని ఈ సంవత్సరం ఫిబ్రవరి 17 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని పోస్టర్ లను విడుదల చేయగా ..  వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించింది. 

మూవీ యూనిట్ తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. జనవరి 9 వ తేదీన ఉదయం 10 గంటల 15 నిమిషాలకు ఈ మూవీ టీజర్ ను విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మరి ఈ టీజర్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. ఇది ఇలా ఉంటే ఎస్ ఆర్ కళ్యాణ మండపం మూవీ తర్వాత పలు మూవీ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కిరణ్ కు మంచి విజయం బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కలేదు. మరి ఈ మూవీ తో ఏ రేంజ్ విజయాన్ని కిరణ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: