
ఇంతకీ ఏం జరిగిందంటే.. శ్రీహాన్ తన కొడుకుగా ఉన్న అబ్బాయిని బెదిరించేందుకు తనను తాను బెల్టుతో కొట్టుకోవడం లాంటివి చేశాడు. అయితే అలా చేస్తున్న సమయంలో ఇక ముందు ఉన్న చిన్నారి బాలుడు మాత్రం ఏడుస్తూ మరోసారి చేయను డాడీ అంటూ దీనంగా మాట్లాడాడు. అయితే ఇదంతా సరదాగా చేశాడు అన్న విషయం వీడియోలో చూస్తే అర్థమవుతుంది. ఇక ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు శ్రీహాన్. అయితే ఇది కొంతమంది నెటిజెన్స్ కు నచ్చలేదు. ముఖ్యంగా ఎప్పుడు సోషల్ మీడియాలో తనకు నచ్చనిది కనిపించినా కూడా కాస్త ఘాటుగా రియాక్ట్ అయ్యే సింగర్ చిన్మయికి.. ఈ వీడియో అస్సలు నచ్చలేదు అని చెప్పాలి.
దీంతో ఈ వీడియో ను తీవ్రంగా ఖండించింది సింగర్ చిన్మయి. శ్రీహాన్ సెల్ఫ్ హర్ట్ చేసుకుంటుంటే పిల్లాడు ఏడుస్తున్నాడు. శ్రీహాన్ చర్య వల్ల పిల్లాడి మనసుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. చెడు ధోరణి వైపు నడుస్తుందని కామెంట్ చేసింది. పేరెంట్స్ పిల్లలు మాటలు వినకపోతే చనిపోతామని బెదిరిస్తారు. చదువు పెళ్లి వ్యవహారాల్లో ఇలా చేస్తూ ఉంటారు. ఇలాంటి దురాచారానికి చరమ గీతం పాడితే బాగుంటుంది. ఇలా బ్లాక్ మెయిలింగ్ చేయడం కరెక్ట్ కాదు అంటూ ఏకంగా చిన్మయ్ శ్రీహాన్ షేర్ చేసిన వీడియో పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వీడియోలతో సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు అన్నట్లుగా ప్రశ్నించింది.